Zainab Ravdjee – Akkineni Akhil | అక్కినేని హీరో, టాలీవుడ్ నటుడు అఖిల్ తన బ్యాచిలర్ లైఫ్‌కి ముగింపు పలికాడు. నేడు అఖిల్ నిశ్చితార్థం జరిగినట్లు అతడి తండ్రి నటుడు నాగార్జున (Nagarajuna) సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. జైనాబ్ రావ్డ్జీ(Zainab Ravdjee)తో అఖిల్ నిశ్చితార్థం నేడు ఘనంగా జరిగింది. దీంతో అఖిల్‌కు అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదిలావుంటే అఖిల్ పెళ్లి చేసుకోబోతున్న ఈ అమ్మాయి ఎవరంటూ అటు అభిమానులతో పాటు నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం.. ఈ జైనాబ్ రావ్డ్జీ తండ్రి జుల్ఫీ రావ్డ్జీ (Zulfi Ravdjee) అని తెలుస్తుంది. ఇతడు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డికి ముఖ్య సలహాదారునిగా పనిచేయడమే కాకుండా మిడిల్ ఈస్ట్ దేశాలకు AP ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా సేవలు అందించారు. అలాగే జగన్, నాగార్జునల ఫ్యామిలీలతో కూడా దగ్గరి సంబంధం ఉన్నట్లు సమాచారం. మరోవైపు తనకంటే 9 ఏండ్లు పెద్దదైన జైనాబ్‌ని అఖిల్ పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. జైనాబ్ వయస్సు ప్రస్తుతం 39 సంవత్సరాలు కాగా.. అఖిల్ వయస్సు 30.