అగ్ర కథానాయకుడు రజనీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. రజనీకాంత్ నటిస్తున్న 171వ చిత్రమిది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో అగ్ర హీరో నాగార్జున కీలకమైన అతిథి పాత్రలో నటించనున్నట్లు తెలిసింది.
కథాగమనంలో ఆయన పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని సమాచారం. ఈ చిత్రానికి ‘రానా’ అనే టైటిల్‌ను ఖరారు చేయబోతున్నారని చెబుతున్నారు. ఈ సినిమాలో రజనీకాంత్ కూతురిగా శృతిహాసన్ నటించనుంది. భారీ యాక్షన్ హంగులతో దర్శకుడు లొకేష్ కనకరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇదిలావుండగా ప్రస్తుతం నాగార్జున..ధనుష్‌తో కలిసి మల్టీస్టారర్ ‘కుబేర’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.