సుదీర్ఘ కెరీర్లో అగ్ర నటుడు నాగార్జున వందో సినిమా మైలురాయిని చేరుకున్నారు. ఈ ప్రయాణంలో అనేక ప్రయోగాలు, బాక్సాఫీస్ సూపర్‌హిట్స్ ఆయన ఖాతాలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నాగార్జున వందో సినిమా కోసం ఆయన అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రా కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు ‘కింగ్ 100’ ‘లాటరీ కింగ్’ అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. ఈ సినిమా కొత్త షెడ్యూల్ త్వరలో మైసూర్లో మొదలుకానుంది.
తాజాగా ఈ సినిమా కథాంశం గురించి ఆసక్తికరమైన వార్త బయటికొచ్చింది. ఓ సాధారణ వ్యక్తి లాటరీల ద్వారా కోటీశ్వరుడిగా ఎదిగిన వైనం, ఈ క్రమంలో చోటుచేసుకునే పరిణామాల నేపథ్యంలో పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. నాగార్జున సరికొత్త మేకోవర్‌తో కనిపించబోతున్నారని, యాక్షన్ ఘట్టాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని సమాచారం. ఈ సినిమాలో సీనియర్ నటి టబు కీలకమైన అతిథి పాత్రలో నటించనుందట. ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.