కింగ్ నాగార్జున గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నాడు. అయితే నాగ్ వరుస సినిమాలని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నప్పటికీ అవి పెద్ద విజయాలు సాధించలేకపోతున్నాయి. ఈ క్రమంలో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్నారు. చివరిగా వైల్డ్ డాగ్ చిత్రంతో పలకరించిన నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ని చేస్తున్న సంగతి తెలిసిందే.
గత కొద్ది రోజులుగాఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఈ రోజు చిత్రం నుంచి ఒక మాస్ అనౌన్సమెంట్ మరియు ప్రీ లుక్ పోస్టర్ బయటకి వచ్చింది.వర్షంలో కత్తిని పట్టుకొని ఉన్న నాగ్ యాక్షన్ మూడ్‌లో ఉన్నట్టు పోస్టర్ని చూస్తుంటే అర్ధమవుతుంది. ఈ చిత్రాన్ని హాలీవుడ్ లెవెల్ ప్రమాణాలతో అత్యున్నత స్థాయిలో తెరకెక్కిస్తున్నట్టుగా అర్ధం అవుతుంది.
ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ గోవాలో పూర్తైంది. రెండో షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతుంది. ఇందులో నాగార్జున ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ప్యాక్ రోల్లో కనిపించనున్నారు. ఇండియాలోని ప్రధాన నగరాలు, విదేశాల్లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేసింది చిత్ర యూనిట్. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, నారాయణ్‌దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహనరావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.