నాగార్జున ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా నటిస్తున్న చిత్రం ‘ది ఘోస్ట్’. ప్రవీణ్ సత్తారు దర్శకుడు. నారాయణ్‌దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్నారు. అక్టోబర్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. థియేట్రికల్ ట్రైలర్‌ను అగ్ర హీరో మహేష్‌బాబు విడుదల చేశారు. ఇంటర్‌పోల్ ఆఫీసర్ విక్రమ్ గ్యాంగ్స్టర్స్ నుంచి తన కుటుంబానికి ఉన్న ముప్పును పసిగట్టి..వారిని కాపాడుతానని తండ్రికి మాటివ్వడం, ఈ క్రమంలో అతను చేపట్టిన ఆపరేషన్ నేపథ్యంలో ట్రైలర్ ఆసాంతం ఉత్కంఠగా సాగింది.
థ్రిల్లింగ్ అంశాలతో పాటు ైస్టెలిష్ మేకింగ్ ఆకట్టుకుంది. ఇంటర్‌పోల్ ఆఫీసర్ విక్రమ్‌గా నాగార్జున సరికొత్త మేకోవర్‌తో కనిపించారు. ఈ సినిమాలో నాగార్జున సోదరిగా గుల్ పనాగ్, మేన కోడలుగా అనిఖా సురేంద్రన్ నటిస్తున్నది. రొమాంచితమైన యాక్షన్ ఘట్టాలతో ట్రైలర్ మెప్పించింది. ఈ చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీతాన్నందించారు.