నాగార్జున ప్రస్తుతం వైజాగ్‌లో ఉన్నారు. అక్కడ ఆయన ఓ షూటింగ్లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఆ షూటింగ్‌కి సంబంధించిన విజువల్స్ కూడా కొన్ని బయటకు వచ్చాయి. ఇంతకీ నాగ్ నటిస్తున్న ఆ సినిమా ఏంటి? అనే విషయానికొస్తే.. రజనీకాంత్ ‘కూలీ’ సినిమాలో నాగ్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగే ప్రస్తుతం వైజాగ్‌లో జరుగుతున్నది. ఇందులో నాగ్ పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.
రజనీకాంత్‌తో ఢీ అంటే ఢీ అనే పాత్రలో నాగార్జున కనిపిస్తారట. రజనీకాంత్ ‘వేైట్టెయాన్’ చిత్రం వచ్చే నెలలో విడుదల కానుంది. ఆ సినిమా తర్వాత ‘కూలీ’ వంతు. ఈ సినిమాకు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.