తెలుగు పాపులర్ టీవీ రియాలిటీ షోల్లో లీడింగ్ పొజిషన్లో ఉంటుంది బిగ్‌బాస్. సీజన్ సీజన్‌కు కొత్త కొత్త సెలబ్రిటీలతో సందడిగా సాగుతూ.. టాప్ టీఆర్పీ రేటింగ్స్ లో కొనసాగే ఈ షో..తాజాగా బిగ్ బాస్ సీజన్ 6 (Bigg Boss Telugu 6)తో విజువల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయింది. అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)హోస్టుగా వ్యహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 ఇవాళ సాయంత్రం గ్రాండ్‌గా లాంఛ్ అయింది.
‘గెలుపు ఆట మీదున్న ఆసక్తి ఉన్నవాడిని కాదు..ఆటలో ఆశయం ఉన్నవాడిని మాత్రమే గెలిపిస్తుంది..ఈ గేమ్‌లో స్నేహాలు, ప్రేమలు ఎన్ని ఉన్నా..ఈ యుద్దంలో ఆత్మవిశ్వాసమే ఆయుధమైనపుడు ప్రశ్నించడానికి, ప్రశంసించడానికి, సమర్థించడానికి, శాసించేందుకు గెలుపునకు తోడుగా ఓటమికి ధైర్యంగా, అందరికీ అండగా, రాజ్యాన్ని గెలిచే రాజు ఒక్కడుంటాడు..అంటూ సాగే వాయిస్ ఓవర్‌తో బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు.
ఇక ఈ ఫీల్డ్‌లో కొత్తగా ఏదైనా ప్రయత్నించాలంటే నా తరువాతే రా’ అంటూ ఎంట్రీతో పంచ్ లైన్ పేల్చాడు నాగ్. అనంతరం బంగార్రాజు టైటిల్ సాంగ్‌కు బిగ్ బాస్ షో స్టేజీపై ముద్దుగుమ్మలతో కలిసిఅదిరిపోయే స్టెప్పులు వేశాడు నాగార్జున.