హౌజ్‌లో ప్రియాంక-మానస్ రిలేషన్‌పై ఆసక్తికర చర్చ నడించింది.పింకీ టూమచ్‌గా ఆశలు పెట్టుకుంటుంది.. ఆమెను చూస్తుంటే భయంగా ఉంది.. తన గురించి తాను ఆడకుండా మానస్ కోసమే ఆడుతుందని చెప్పింది అనీ మాస్టర్. నాకు మానస్ వాళ్ల మదర్ కూడా తెలుసు.. ఆమె కాబోయే కోడలు కోసం ఎలా ఆలోచిస్తుందో నాకు తెలుసు అని రవి అన్నాడు. అయితే ఇదే విషయంపై ప్రియాంక.. మానస్‌తో మాట్లాడగా, ఇవన్నీ పట్టించుకోకు అని చెప్పాడు మానస్.
సిరి దగ్గర స్టిక్కర్స్ తీసుకుంది తానే అని చెప్పాడు రవి. మనతో ఆడటానికి రవి ట్రై చేస్తున్నాడని కాజల్‌తో గుసగుసలాడాడు షణ్ను. శ్రీరామ్ కూడా రవికి లొంగిపోయాడని, లోబో, విశ్వ రవి కోసమే ఆడుతున్నారని అభిప్రాయపడ్డాడు. ప్రతివారం హౌజ్‌లో బెస్ట్, వరస్ట్ పర్ఫార్మర్ టాస్క్ జరుగుతుండగా, ఈ సారి నాగార్జున నాయకత్వంలో నడిచింది. ముందు ఈ గేమ్‌ని రవితోనే మొదలు పెట్టాడు నాగార్జున.
ప్రియాంక ఫుడ్‌ని ఎక్కువగా వేస్ట్ చేస్తుందని అందుకే తనని వరస్ట్ పెర్ఫామర్ అని చెప్పాడు రవి. ఈ సందర్భంగా నాగ్.. సిరి స్టిక్కర్లు దొంగతనం చేయడం సరైందే కానీ అమ్మతోడు ఎందుకు వేశావని రవిని నిలదీశాడు. దీంతో అడ్డంగా దొరికిపోయిన రవి.. అది తప్పేనని ఒప్పుకుంటూనే కావాలని చేయలేదని బుకాయించాడు. అలా లాగితే మరింత దొరికిపోతావు రవి అని నాగ్ అనే సరికి సైలెంట్ అయ్యాడు.