Nagarjuna | గత కొద్ది రోజులుగా అఖిల్ పెళ్లి ఎప్పుడు ఉంటుందా అని ఎదురు చూసే వాళ్లకి ఓ క్లారిటీ వచ్చింది. జూన్ 6 తెల్లవారుజమూన 3గం.లకి తన ప్రియురాలు జైనబ్ మెడలో అఖిల్ మూడు ముళ్లు వేశాడు. జూబ్లిహిల్స్‌లోని నాగార్జున ఇంట ఈ పెళ్లి వేడుక జరిగినట్టు తెలుస్తుంది. ఈ వేడుకకి చిరంజీవి, రామ్ చరణ్ ఫ్యామిలీతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఇక పెళ్లికి ముందు జరిగిన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా అదిరిపోయాయట. వేడుకకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
అఖిల్ సంగీత్ వేడుకలో నాగార్జున చేసిన డ్యాన్స్‌కి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుంది. నాగార్జున ఐకానిక్ స్టెప్ వేస్తూ సూపర్ ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపించగా,ఆయనతో పెళ్లి కొడుకు అఖిల్ అతని సోదరుడు యువ సామ్రాట్ నాగ చైతన్య కూడా జత కలిశారు. అక్కినేని అందగాళ్లంతా కలిసి కాలు కదపుతుంటే అక్కడున్న వారందరికి మంచి ఉత్సాహాన్ని కలిగింది. అఖిల్ పెళ్లిలో సందడి అంతా నాగార్జున, నాగ చైతన్యదే అని అంటున్నారు. వారిద్దరు తెగ ఎంజాయ్ చేశారట. ఇక జూన్ 8న భారీ విందు ఏర్పాటు చేయనున్నారని ఈ వేడుకకి ఇండస్ట్రీ అంతా తరలి రానుందని తెలుస్తుంది. అలానే ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు, పలువురు రాజకీయ నాయకులు కూడా హాజరు కానున్నారట.
అఖిల్ పెళ్లి వేడుకలో చిరంజీవి కూడా సందడిగా కనిపించారని తెలుస్తుంది. అక్కినేని ఫ్యామిలీ పర్సన్ సుశాంత్ కూడా డ్యాన్స్‌తో అలరించాడు. దర్శకధీరుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ కూడా బరాత్‌లో పాల్గొని డ్యాన్స్‌తో దుమ్ము రేపాడు. గతేడాది నవంబర్ 26న అఖిల్ – జైనబ్ ఎంగేజ్మెంట్ జరగ్గా, అప్పటి ఫొటోలను నాగార్జున స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఇప్పుడు కూడా అదే బాటలో పెళ్లి ఫొటోలు ఆయనే విడుదల చేశారు. ఇవి చూసిన ఫ్యాన్స్ జంట చూడముచ్చటగా ఉన్నారని, నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని విషెస్ తెలియజేస్తున్నారు.