కెరీర్ పరంగా ఓ కీలకమైన ఘట్టంలోకి అడుగుపెట్టనున్నారు అగ్ర హీరో అక్కినేని నాగార్జున. దశాబ్దాలు సాగిన ఆయన నట ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు. ఎన్నో అత్యద్భుతమైన సినిమాల్లో నటించారు. నటుడిగా తెలుగువారి హృదయాల్లో నాగ్ స్థానం చాలా విలువైనది. కుబేర, కూలీ చిత్రాల్లో ప్రత్యేక పాత్రల్లో మెరిశారు నాగార్జున. మరి ఆయన నెక్ట్స్ ఏం చేయబోతున్నారు? అనేది అభిమానుల్లో నెలకొని ఉన్న ప్రశ్న. నెక్ట్స్ నాగార్జున చేయబోయేది ఆయన 100వ సినిమా. ఎట్టకేలకు 100వ మైలురాయిని చేరుకున్నారు నాగ్. మరో విశేషం ఏంటంటే.. ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోస్ ప్రారంభమై ఈ ఏడాదితో 50ఏళ్లు పూర్తవుతున్నది.
ఈ విశేషాల నడుమ నాగ్ తన వందవ సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే దర్శకుడు పా.కార్తీక్ అద్భుతమైన స్క్రిప్ట్‌ని సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. స్క్రిప్ట్ విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకున్నారట. ఈ నెల 29న నాగ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనున్నది. అలాగే.. ఓ కాన్సెప్ట్ టీజర్‌ను కూడా రెడీ చేశారట. అది కూడా అదే రోజున విడుదల కానున్నట్టు సమాచారం. ఇకనుంచి వైవిధ్యమైన పాత్రలతో ముందుకెళ్లాలని నాగార్జున భావిస్తున్నారట.