Nagarjuna 100 | నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి, తనదైన స్టైల్‌తో అక్కినేని వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు యువ సామ్రాట్ నాగార్జున. రొమాంటిక్ హీరోగా, యాక్షన్ స్టార్‌గా, ఫ్యామిలీ ఎంటర్టైనర్ హీరోగా అన్ని రకాల జానర్లలోనూ తన ప్రతిభను నిరూపించుకున్న నాగ్, ఇప్పుడు తన కెరీర్లో 100వ చిత్రం కోసం రెడీ అవుతున్నాడు.ఇటీవల ‘కుబేర’ , ‘కూలీ’ చిత్రాల్లో నటించి నటన పరంగా మళ్లీ తన రేంజ్ చూపించిన నాగ్, ఈ మైలురాయి ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నాడు.
తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి కోలీవుడ్ దర్శకుడు రా కార్తీక్ దర్శకత్వం వహించనున్నాడు. మొదట దసరాకి షూటింగ్ ప్రారంభం అవుతుందని ప్రచారం జరిగినా, అది కుదరలేదు. కానీ, తాజా సమాచారం ప్రకారం అక్టోబర్‌లోనే పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సినిమాలో నాగార్జునతో పాటు ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారని టాక్. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, ఈ ప్రాజెక్టును స్వయంగా నాగార్జున తన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ కూడా హాట్ టాపిక్‌గా మారింది.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ‘లాటరీ కింగ్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. నాగార్జునని అభిమానులు “కింగ్” అని పిలుస్తుంటారు కాబట్టి, ఈ టైటిల్ క్యాచీగా, అర్థవంతంగా ఉంటుందని టీమ్ భావిస్తోందట. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకునే ఈ సినిమాలో నాగచైతన్య, అఖిల్ కూడా కనిపించనున్నారని సమాచారం. వారు కీలక పాత్రల్లో నటిస్తారా, లేక ప్రత్యేక క్యామియోల్లోనే కన్పిస్తారా అన్నది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. అక్కినేని ఫ్యాన్స్ మాత్రం ఈ అప్డేట్స్తో ఉత్సాహంగా ఉన్నారు. నాగ్ 100వ సినిమా అంటే అక్కినేని కుటుంబానికి, అభిమానులకు ప్రత్యేకమైన మైలురాయి. అందుకే, వీలైనంత త్వరగా షూటింగ్ ప్రారంభించి, ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్ రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.