Nagarajuna 99th Movie | ఒకప్పుడు నాగ్ వరుస సినిమాలు చేస్తూ యమ బిజీగా ఉండేవాడు. కానీ ఇప్పుడు వేగం తగ్గించాడు. ఏడాది, రెండేళ్లకు ఒక సినిమా రిలీజ్ చేస్తున్నాడు. కారణం ఏంటో తెలియదు కానీ ఒకప్పుడు జెట్ స్పీడ్‌లా దూసుకుపోయే నాగ్ ఇప్పుడు చాలా డల్ అయ్యాడు. పైగా దానికి తోడు నాగ్ చేసిన సినిమాలన్నీ వరుసగా పెవీలియన్ బాట పడుతున్నాయి. నిజానికి సోగ్గాడే చిన్నినాయన తర్వాత ఇప్పటి వరకు నాగ్ మరో హిట్ కొట్టలేకపోయాడు. మధ్యలో ఊపిరి, బంగార్రాజు పర్వాలేదనిపించినా.. అందులో వేరే హీరోలు కూడా ఉండటంతో హిట్ క్రెడిట్ నాగ్ ఒక్కడికే ఇవ్వలేం.
గత మూడేళ్లుగా నాగార్జున నటించిన సినిమాలన్ని ఎపిక్ డిజాస్టర్లే. దాంతో నాగ్ ఇప్పుడు ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. ఎంత లేటైనా సరే మంచి కంబ్యాక్ ఇవ్వాలని కసితో ఉన్నాడు. నాగ్ ఇప్పుడు 99వ సినిమాకు రెడీ అవుతున్నాడు. స్టార్ రైటర్‌గా టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రసన్న కుమార్ బెజవాడతో నాగ్ 99వ సినిమా చేస్తున్నాట్లు గతంలో నుంచే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ ఎంతకీ స్టార్ట్ అవడంతో నాగ్ ఫ్యాన్స్ అందోళన పడుతున్నారు. అసలు ఈ సినిమా ఉందా? క్యాన్సిల్ అయిందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
నాగ్ దీనికొసమే ప్రత్యేకంగా గడ్డం కూడా పెంచాడని తెలుస్తుంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్టయిన పోరింజు మరియం జోస్ ఆధారంగా రూపొందనుంది. తెలుగు నెటివిటీకి తగ్గట్లు ప్రసన్న కుమార్ మార్పులు చేర్పులు చేశారట. ఇక వచ్చే ఏడాది సంక్రాంతిని డెడ్ లైన్‌గా పెట్టుకుని సినిమాను మొదట ప్లాన్ చేసారు మేకర్స్. అయితే నాగ్ మాత్రం అన్ని కుదిరాకే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్లాన్‌లో ఉన్నాడట. లేటైనా పర్వాలేదు కానీ సాలిడ్ అవుట్ పుట్తో రావాలని కసితో ఉన్నాడట.