Naga babu | ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ రామాయణం, హిందూ ధర్మంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇటీవల ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాష్ రాజ్, రాముడు మరియు లక్ష్మణుడు ఉత్తర భారతం నుంచి వచ్చి దక్షిణాదిలో రావణుడి పొలంలో పండ్లు తిన్నారని, ఆ విషయంపైనే వివాదం చెలరేగిందంటూ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో నాగబాబు స్పందిస్తూ, తనను తాను క్రైస్తవ నాస్తికుడిగా చెప్పుకునే ప్రకాష్ రాజ్, తన తల్లి అంత్యక్రియల సమయంలో ఆమె విశ్వాసాలను గౌరవించినట్లే కోట్లాది మంది భక్తుల నమ్మకాలను కూడా గౌరవించాలని హితవు పలికారు. నాస్తికత్వం అంటే దేవుళ్లను లేదా భక్తులను కించపరచడం కాదని, అది ఒక హేతుబద్ధమైన ఆలోచనా విధానమని స్పష్టం చేసిన నాగబాబు, నాస్తిక వాదాన్ని కూడా గౌరవించే గొప్ప సంప్రదాయం కలిగిన హిందూ ధర్మాన్ని తృణీకరించడం హేతుబద్ధత అనిపించుకోదని, అది కేవలం అగౌరవపరచడమేనని మండిపడ్డారు. ఇతర దేశాల్లో ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చేదని హెచ్చరించిన ఆయన, కనీస గౌరవం లేని ప్రకాష్ రాజ్ వంటి వ్యక్తులతో భవిష్యత్తులో తాను వాదించబోనని సూటిగా వ్యాఖ్యానించారు. భిన్నమైన నమ్మక వ్యవస్థలను గౌరవించడమే నిజమైన బాధ్యత మరియు హేతుబద్ధతకు నిదర్శనమని నాగబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Mr. Prakash Rai, though you call yourself a Christian atheist, you respected your mother’s faith at her funeral a gesture we honor as a son’s duty. In the same spirit, you must respect the beliefs of millions. Atheism is not mocking gods or believers,it is a rational way of…
— Naga Babu Konidela (@NagaBabuOffl) April 18, 2026