MAD Square | టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ నిర్మాణంలో వచ్చిన తాజా చిత్రం మ్యాడ్ స్క్వేర్ (MAD Square). సూపర్ హిట్ చిత్రం మ్యాడ్ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ మూవీ టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయని.. సినిమా బాగాలేకున్న మేకర్స్ ఫేక్ కలెక్షన్ల్ చూపిస్తున్నారని కామెంట్లు వస్తున్న విషయం తెలిసిందే. పలు వెబ్సైట్లలో ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. దీంతో తాజాగా ప్రెస్ మీట్ పెట్టిన నాగవంశీ.. మీడియా జర్నలిస్ట్‌లతో పాటు రివ్యూలు ఇచ్చే పలు వెబ్సైట్లపై ఆగ్రహాం వ్యక్తం చేశాడు.
ఆ సినిమాకు తక్కువ కలెక్షన్లు వచ్చాయని అంటున్నారు. వారికి నేను సమాధానం చెప్పాలి అనుకుంటున్నా. ఎవరికి తక్కువ కలెక్షన్లు వచ్చాయి అనిపిస్తుందో నా దగ్గరికి రండి వారికి అసలు కలెక్షన్లు చూపిస్తాను. ఇదేమైన పెద్ద హీరో సినిమానా కలెక్షన్లు రాకున్న బయట హౌస్‌ఫుల్ బోర్డ్ పెట్టడానికి.. నాకు అలాంటి అవసరం కూడా లేదు. సినిమా ఆడుతున్నప్పుడు.. ఎందుకు సపోర్ట్ చేయడం లేదు. ఎందుకు నెగిటివ్ రివ్యూలు రాస్తున్నారు. నా మీద అంత పగ ఉంటే దమ్ముంటే నా సినిమాలు బ్యాన్ చేసి చూపించండి. నా సినిమా ఆర్టికల్స్ రాయకండి. నా దగ్గర యాడ్ తీసుకోకండి. అప్పుడు నేను కూడా చూపిస్తాను నా సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో అంటూ నాగవంశీ చెప్పుకోచ్చాడు.
Naa Cinemalu Ban cheyyandi.. Ads Teesukokandi. Reviews Raayakandi.#NagaVamsi fires on websites & media.. #MadSquare
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) April 1, 2025