Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారి నటిస్తున్న పిరియాడిక్ యాక్షన్ డ్రామా ‘హరి హర వీరమల్లు’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. తొలుత జూన్ 12న విడుదల కావాల్సిన ఈ చిత్రం, కొన్ని కారణాల వల్ల జూలై 24కు వాయిదా పడింది. అయితే ఈ లోపు అభిమానుల్లో ఉత్సాహం పెంచేందుకు జూలై 3న ట్రైలర్‌ని విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.అయితే ఈ ట్రైలర్‌పై నిర్మాత నాగ వంశీ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మీరు ఏమి ఊహిస్తున్నారో నాకు తెలియదు… కానీ జూలై 3న రండి. మీకో పెద్ద సర్ప్రైజ్ ఉంది!హరిహర వీరమల్లు ట్రైలర్ అసాధారణంగా ఉంటుంది. మీరు గతంలో ఎప్పుడు పవన్‌ని చూడని విధంగా చూస్తారు.
అంతేకాదు దానిని ఫీల్ అవుతూనే దానిని గురించి చర్చిస్తారంటూ హైప్ క్రియేట్ చేశారు. ఈ వ్యాఖ్యలతో ఫ్యాన్స్ లో ట్రైలర్‌పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పవన్ కళ్యాణ్ యాక్షన్, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంటుందో చూడాలని వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతోంది. పవన్ కళ్యాణ్ ఇందులో ఓ పోరాట యోధుడి పాత్రలో కనిపించనున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా, మ్యూజిక్ డైరెక్టర్ గా ఎం.ఎం. కీరవాణీ సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయిన ఈ సినిమా జూలై 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్, గ్రాండ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా, తెలుగు ప్రేక్షకులకే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించనుంది. మరోవైపు నిర్మాత నాగ వంశీ తాజాగా విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘కింగ్డమ్’ సినిమా గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై నాగ వంశీ స్పందిస్తూ..”కింగ్డమ్కు సంబంధించి ఏ పోస్ట్ చేసినా ట్రోల్స్ వస్తున్నాయనేది నిజం. కాకపోతే నన్ను నమ్మండి… సినిమా విడుదలయ్యాక, వెండితెరపై అద్భుతం చూపించేందుకు మా టీమ్ ఎంతో కష్టపడుతోంది. ఈ మూవీ చూసిన తర్వాత మీరు ఫీల్ అయ్యే అనుభవం అసాధారణంగా ఉంటుంది అని తెలిపారు.