రామ్ నితిన్, సంతోష్ శోభన్, నార్నే నితిన్, గౌరీ ప్రియా రెడ్డి, అవంతిక సునీల్ కుమార్, గోపికా ఉద్యన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘మ్యాడ్’. సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కల్యాణ్ శంకర్ దర్శకుడు. అక్టోబర్ 6న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘మ్యాడ్’ గ్యాంగ్‌ను పరిచయం చేస్తూ మంగళవారం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. తాను తీసిన ‘జాతిరత్నాలు’ కంటే ఈ సినిమాలోనే ఎక్కువ వినోదం ఉందని అతిథిగా హాజరైన దర్శకుడు అనుదీప్ అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ సినిమాలో కేవలం వినోదం మాత్రమే ఉంటుంది. ‘మ్యాడ్’ క్యారెక్టర్స్ పంచే కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. ప్రతీ ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు’ అన్నారు. “జాతిరత్నాలు’ కంటే ఒక్కసారైనా తక్కువ నవ్వానని ఎవరైనా చెబితే టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తా. ఈ సినిమా మీద అంత నమ్ముకం ఉంది. లాజిక్‌లు, ట్విస్ట్‌లు ఏమీ లేకుండా నవ్వడమే లక్ష్యంగా ఈ సినిమా తీశాం’ అని నిర్మాత నాగవంశీ పేర్కొన్నారు.