War 2 | సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ కలిగిన కొద్ది మంది తెలుగు నిర్మాతల్లో సూర్యదేవర నాగవంశీ ఒకరు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వరుస హిట్ చిత్రాలు నిర్మిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన స్పష్టమైన మాటతీరు, ఆలోచనల్లో దాపరికం లేకపోవడం వల్ల ఎప్పుడూ వార్తల్లో నిలిచే నాగవంశీ… అదే సమయంలో ట్రోలింగ్‌కు కూడా గురవుతుంటారు. అయితే 2025 సంవత్సరం తనకు అనుకున్నట్టుగా సాగలేదని, అందుకే 2026 జనవరి 1 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని నాగవంశీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ ఏడాది ‘వార్ 2’, ‘కింగ్డమ్’, ‘మాస్ జాతర’ వంటి సినిమాల విషయంలో తన నిర్ణయాలు ఫలించకపోవడంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
2025 ప్రారంభంలో వచ్చిన ‘డాకూ మహారాజ్’ సినిమా నాకు మంచి పేరు తీసుకొచ్చింది. కానీ అదే సమయంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఎక్కువగా డామినేట్ చేసింది. అయినప్పటికీ టెక్నికల్‌గా బాలయ్య సినిమా ఈ ఏడాది బెస్ట్ మూవీస్‌లో ఒకటి” అని చెప్పారు. అదే విధంగా తమ బ్యానర్లో వచ్చిన ‘మ్యాడ్ స్క్వేర్’ మంచి రిజల్ట్ ఇచ్చిందని, కానీ ఆ తర్వాత నుంచి తనకు పరిస్థితులు ప్రతికూలంగా మారాయని పేర్కొన్నారు. “అందుకే ఈ ఏడాది త్వరగా పూర్తవ్వాలని, కొత్త ఏడాది కోసం ఎదురుచూస్తున్నాను” అని అన్నారు. సక్సెస్, ఫెయిల్యూర్లు ఇండస్ట్రీలో సహజమేనని నాగవంశీ స్పష్టం చేశారు. ఒక సినిమాతో లాభం వస్తే, ఇంకో సినిమాతో నష్టం రావడం సహజం. దానికి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని డెసిషన్స్ నేను ఓవర్ కాన్ఫిడెన్స్‌తో తీసుకున్నాను. అవన్నీ మిస్‌ఫైర్ అయ్యాయి. ‘వీడికి కొంచెం ఎక్కువైంది’ అనిపించినప్పుడు దేవుడు కింద పడేస్తాడు. అప్పుడు మనకి నిజం అర్థమవుతుంది” అంటూ తన తప్పులను ఓపెన్‌గా ఒప్పుకున్నారు.
వార్ 2 చిత్రాన్ని తాను ₹68 కోట్లకు కొనుగోలు చేశానని నాగ వంశీ వెల్లడించాడు. ఆ సినిమా ₹40 కోట్ల షేర్ రాబట్టగా, ఆ తర్వాత యష్ రాజ్ ఫిల్మ్స్ తనకు ఫోన్ చేసి ₹18 కోట్లు తిరిగి చెల్లించింది. ఈ సర్దుబాటుతో, ఆ సినిమా వల్ల తనకు పెద్దగా నష్టాలు ఏమీ రాలేదని స్పష్టం చేశారు. పెద్ద కార్పొరేట్ బ్యానర్ అయినప్పటికీ, ఒప్పందాన్ని గౌరవించి వెంటనే మొత్తాన్ని తిరిగి చెల్లించినందుకు యష్ రాజ్ ఫిల్మ్స్ పై ప్రశంసలు కురిపించారు నాగ వంశీ. ఇదే ఇంటర్వ్యూలో నాగవంశీ తన రాబోయే చిత్రం ‘అనగనగా ఒక రాజు’ గురించి కూడా మాట్లాడారు. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది అని అన్నాడు.