AA 22 | పుష్ప2 సినిమా తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమా చేయనున్నాడు అనే దానిపై కొద్ది రోజులుగా చర్చ నడుస్తుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మూవీ చేయనున్నాడా లేదంటే అట్లీతో చేస్తాడా అనే దానిపై సస్పెన్స్ నెలకొని ఉంది. అయితే త్రివిక్రమ్- అల్లు అర్జున్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన నిర్మాత నాగవంశీ తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీ సోషియా ఫాంటసీ కాదని పూర్తిగా మైథలాజికల్ జానర్ అని నాగవంశీ వివరణ ఇచ్చారు. ‘పురాణాల్లో ఎవరూ ఊహించని ఓ దేవుని కథ ఆధారంగానే ఈ సినిమా ఉంటుందని, అక్టోబర్ నుండి చిత్రం షూటింగ్ ప్రారంభం కానుందని తెలియజేశారు.
త్రివిక్రమ్ సినిమాలో అల్లు అర్జున్ కుమారస్వామిగా కనిపించనున్నారు అంటూ జోరుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు నాగవంశీ కూడా మైథలాజికల్ జానర్ అని చెప్పడంతో బన్ని లుక్ ఎలా ఉంటుందా అని జోరుగా చర్చలు నడుస్తున్నాయి.మరోవైపు అల్లు అర్జున్ కుమారస్వామిగా ఉన్న జీబ్లీ ఇమేజ్‌లు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి . ఈ మూవీని చూసి భారతదేశమే ఆశ్చర్యపోతుందని గత ఇంటర్వ్యూల్లో నాగవంశీ చెప్పడంతో అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ మూవీ రామాయణం, మహాభారతం వంటి ప్రసిద్ధ ఇతిహాసాలపై కాకుండా.. ఎవరికీ తెలియని మైథలాజికల్ కథలని బేస్ చేసుకొని తెరకెక్కించబోతున్నారట.
పురాణాల్లో ఎవరికీ తెలియని ఓ దేవుని కథ ఆధారంగా త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ స్థాయిలోరూపొందించనున్నారు. బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో మూవీస్ బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ అందుకున్నాయి. ఇక ఇప్పుడు వీరి కాంబోలో వస్తోన్న ‘AA22’ ప్రాజెక్ట్‌పై ఓ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మైథలాజికల్ జానర్లో వస్తుండడంతో ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేయడం ఖాయం అంటున్నారు.చివరిగా బన్నీ పుష్ప, పుష్ప2 చిత్రాలతో అతి పెద్ద విజయాలు సాధించాడు. ఇప్పుడు వాటిని మించేలా త్రివిక్రమ్, అట్లీ చిత్రాలు ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.