Bad Boy Karthik | యువ హీరో నాగశౌర్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. గతంలో ఆయన నటించిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పర్చడంతో ఎలాగైన హిట్ కొట్టాలానే కసితో ఉన్నాడు. ఈ క్రమంలోనే వరుస సినిమాలను ఓకే చేస్తున్నాడు. ఈ క్రమంలోనే కొత్త దర్శకుడు రామ్ దేశిన డైరెక్షన్లో నాగశౌర్య ‘బ్యాడ్ బాయ్ కార్తిక్’ అనే ఓ యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్నాడు. శ్రీవైష్ణవి ఫిల్మ్స్ పతాకంపై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ అప్డేట్ను పంచుకుంది చిత్రయూనిట్. ఈ సినిమా టీజర్‌ను రేపు ఉదయం 11.57 గంటలకు విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకుంది.
#BadBoyKarthik‘s MASS Madness & Kickass ACTION Begin Tomorrow 🔥🔥
Witness the explosive #BadBoyKarthikTeaser Tomorrow at 11:57AM 💥💥
A @Jharrisjayaraj Musical🎶@IamNagashaurya @Viidhi28_ @vennelakishore @thondankani @RameshDesina @Sri4279 #SrinivasaRaoChintalapudi… pic.twitter.com/ePBI5largf
— BA Raju’s Team (@baraju_SuperHit) October 5, 2025