Naga Shaurya’s Krishna Vrindha Vihari | ఎలాంటి సీని బ్యాగ్రౌండ్ లేకుండా ఒక్కో మెట్టు ఎక్కుతూ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు నాగశౌర్య. టైర్2 హీరోల లిస్ట్‌లో చేరిపోయిన నాగ శౌర్య సినిమా సినిమాకు కొత్త వేరియేషన్స్ చూపిస్తూ సినీరంగంలో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. లేటెస్ట్గా ఈయన నటించిన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. అనీష్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన నాగశౌర్య ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు విశేష స్పందన లభించింది. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీను ప్రకటిస్తూ మేకర్స్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ చిత్రాన్ని ఏప్రిల్ 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం అనూహ్యంగా ఏప్రిల్ రేసులోకి వచ్చింది. ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. షిర్లీ సేటియా హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ కీలకపాత్రలో నటించింది. మహతీ స్వర సాగర్ సంగీతాన్ని అందించాడు. ఈ చిత్రానికి వారం రోజుల ముందు కేజీఎఫ్2, బీస్ట్ వంటి పాన్ ఇండియా చిత్రాలు విడుదల కానున్నాయి.
#KrishnaVrindaVihari ❤️ is Arriving to Theatres on APRIL 22nd, 2022🎋@ShirleySetia #AneeshKrishna #SaiSriram @realradikaa @ira_creations @mahathi_sagar @saregamasouth#KrishnaVrindaVihariOnApr22 🥳 pic.twitter.com/0G3Itkl32T
— Naga Shaurya (@IamNagashaurya) March 7, 2022