Rangabali Review |
నటీనటులు: నాగశౌర్య (Naga Shaurya) , యుక్తితరేజ (yukti thareja), గోపరాజు రమణ, ఫైన్ టామ్ చాకో, సత్య, శరత్‌కుమార్, మురళీశర్మ, శుభలేక సుధాకర్, అనంత్ శ్రీరామ్, రాజ్‌కుమార్ తదితరులు
సంగీతం: పవన్ సిహెచ్
దర్శకత్వం: పవన్ బాసంశెట్టి
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
‘ఛలో’ చిత్రం తరువాత మళ్లీ ఆ స్థాయి కమర్షియల్ విజయాన్ని అందుకోవడం కోసం నాగశౌర్య (Naga Shaurya) చేయని ప్రయత్నం లేదు. కానీ ఆయనను వరుసగా అపజయాలే పలకరిస్తున్నాయి. తాజాగా కొత్త దర్శకుడు పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘రంగబలి’. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా నాగశౌర్యకు విజయాన్ని అందించిందా? లేదా తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళదాం.
రంగబలి టీజర్..
కథ: రాజవరంలో వుండే యువకుడు శౌర్య(నాగశౌర్య)కు తన సొంత ఊరంటే చాలా ఇష్టం. ఎలాంటి స్థాయిలోనైనా తన ఊరిలోనే మంచి పొజిషన్లో కింగులా బతకాలి అనుకుంటాడు. ఇందుకోసం తన గొప్ప చూపించడం కోసం ఊరిలో జనాల ముందు కొన్ని బిల్డప్పులు కూడా ఇస్తుంటాడు. శౌర్య తండ్రి విశ్వం (గోపరాజు రమణ) ఊళ్లోనే మెడికల్ షాపు నడుపుతూ వున్నంతలో మర్యాదగా జీవిస్తుంటాడు. మెడికల్ షాపును నిర్వహించే బాధ్యత శౌర్యకు అప్పగించాలని ప్రయత్నిస్తుంటాడు. కాని శౌర్య మాత్రం స్నేహితులతో సరదాగా తిరుగుతూ ఊళ్లో గొడవలు పడుతూ, సొంత షాపులోనే డబ్బులు దొంగతనం చేస్తూ రోజులు గడుపుతుంటాడు. ఇక లాభం లేదనుకున్న విశ్వం,కొడుకును ఫార్మసీ శిక్షణ కోసం వైజాగ్ పంపిస్తాడు.అక్కడ సహజ (యుక్తి తరేజ)తో ప్రేమలో పడతాడు. అయితే శౌర్యది రాజవరం అని తెలిసి వీళ్ల పెళ్లికి సహజ తండ్రి (మురళీశర్మ) ఒప్పుకోడు? ఇందుకు కారణం అక్కడ ఊర్లోని రంగబలి సెంటర్. అసలు రంగబలి సెంటర్ కథ ఏమిటి? శౌర్య,సహజ పెళ్లి జరిగిందా? ఇందుకు శౌర్య చేసిందేమిటి అనేది మిగతా కథ
విశ్లేషణ : ఈ కథ ప్రథమార్థమంతా పూర్తి వినోదాత్మకంగా నాన్‌స్టాప్ ఎంటర్టైనర్లా కొనసాగింది. ద్వితీయార్థం కథ సీరియస్ మూడ్‌లోకి వెళ్లిపోయి.. ఆ సెకండాఫ్ అంతా ఎటు పోతుందో తెలియకుండా వెళ్లిపోతుంది. ఫస్ట్ హాఫ్‌లో కనిపించిన వినోదం సెకండాఫ్‌లో మిస్ అయ్యింది. పూర్తి రోటిన్ సన్నివేశాలతో ద్వితీయార్థమంతా బోర్‌గా కొనసాగింది. ఫస్ట్‌హాఫ్ చూసిన వారికి ఇక నాగశౌర్యకు హిట్ పడ్డటే అనుకుంటారు.కానీ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు దర్శకుడు. ప్రేమకథలో కూడా పెద్దగా ఫీల్ వర్కవుట్ కాలేదు. సత్య పాత్ర మాత్రం ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచింది. ఫస్ట్‌హాప్‌లో కనిపించిన జోరు సెకండాఫ్‌లో కూడా కనిపిస్తే శౌర్య ఖాతాలో ఓ హిట్ సినిమా పడేది. కాని సెకండాఫ్ పూర్తి బలహీనంగా వుండటంతో శౌర్య ఖాతాలో మరో ఫ్లాప్ యాడ్ అయ్యింది.
నటీనటుల పనితీరు : శౌర్యగా నాగశౌర్యగా ఎప్పటిలాగే హుషారుగా కనిపించాడు. ఆ పాత్రకు తగ్గ బాడీలాంగ్వేజ్‌తో, డైలాగ్ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. సహజ పాత్రలో యూక్తి తరేజ కూడా ఫర్వాలేదనిపించుకుంది.అగాధం పాత్రలో సత్య నటన ఈ చిత్రానికి మెయిన్ ఎస్సెట్. సత్య పాత్రే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ.గోపరాజు రమణ, మురళీ శర్మ, శుభలేఖ సుధాకర్‌లు వాళ్ల పాత్రల పరిధుల మేరకు నటించారు.
ఫైనల్‌గా: కామెడీ అండ్ ఎమోషన్స్‌కు కలిపి రంగబలిలోని సెకండాఫ్‌ని బలి చేశాడు దర్శకుడు. సెకండాఫ్‌లో కాస్త జాగ్రత్త తీసుకుని వుంటే తప్పనిసరిగా రంగబలి సినిమా ప్రేక్షకుల మెప్పు పొందేది. ఏ సినిమాకైనా ఫస్ట్‌హాఫ్ కొంచెం గ్రాఫ్ తగ్గి, సెకండాఫ్ బెటర్‌గా వుంటే ఆ సినిమా హిట్ ఖాతాలో పడుతుంది. అలా కాకుండా ఫస్ట్ హాఫ్ ఎక్సట్రార్డనరీ అనిపించుకుని సెకండాఫ్ మెప్పించకపోతే ఆ సినిమా హిట్ సినిమాల ఖాతాలో పడటం చాలా కష్టం. ‘రంగబలి’కి అదే జరిగింది. ఫస్ట్‌హాఫ్ భళ్లే..భళ్లే అనిపించుకుని సెకండాఫ్ బలి అయిపోయింది.
బలం: ఫస్ట్‌హాఫ్, సత్య కామెడీ,
బలహీనతలు: ద్వితీయార్థం, పాటలు, ైక్లెమాక్స్
పంచ్: ఫస్ట్‌హాఫ్‌లో మెప్పించాడు.. సెకండాఫ్‌లో విసిగించాడు
రేటింగ్: 2/5
రంగబలి ట్రైలర్..