యువ హీరో నాగశౌర్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కొత్త దర్శకుడు రామ్ దేశిన డైరెక్షన్లో నాగశౌర్య ఓ యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రీవైష్ణవి ఫిల్మ్స్ పతాకంపై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. హైదరాబాద్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నది. నాగశౌర్య పాల్గొనగా యాక్షన్ ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే అరవైశాతం చిత్రీకరణ పూర్తయిందని, హై ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇదని, నాగశౌర్య పాత్ర గతంలో చూడని విధంగా పవర్ఫుల్గా ఉంటుందని మేకర్స్ తెలిపారు.