Custody Movie Teaser | అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం కమర్షియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ఆచి తూచి కథలను ఎంపిక చేసుకుంటున్నాడు. ప్రతీ పాత్రకు వేరియేషన్ ఉండేలా చూసుకుంటున్నాడు. ‘లవ్‌స్టోరీ’, ‘బంగార్రాజు’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో జోరుమీదున్న నాగచైతన్య స్పీడ్‌కు థాంక్యూ బ్రేకులు వేసింది. దాంతో కాస్త గ్యాప్ తీసుకుని తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో కస్టడీ అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లు సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేశాయి. తాజాగా చిత్రబృందం టీజర్‌ను రిలీజ్చేసింది.
టీజర్‌తో మేకర్స్ సినిమా మేయిన్ ప్లాట్ ఏంటో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అవినీతి, ఆరాచకాలకు పాల్పడే కరుడు గట్టిన ఒక గూండా.. ఎవ్వరు తనను ఏమి చేయలేరనే గర్వం.. అదే సమయంలో హీరో చేతికి దొరికిన ఒక నిజం.. దాంతో విలన్ ఆటలకు హీరో ఎలా స్వస్తీ చెప్పాడు అనే నేపథ్యంలో సినిమా తెరకెక్కినట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు పుష్కలంగా ఉన్నట్లు టీజర్‌తో స్పష్టం అవుతుంది. ధృవ తర్వాత అరవింద్ స్వామికి మళ్లీ తెలుగులో ఆ రేంజ్ స్కోప్ ఉన్న పాత్రతో రానున్నట్లు తెలుస్తుంది.
‘గాయ పడిన మనసు ఆ మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. అది ఇప్పుడు తీసుకొచ్చింది ఓ యుద్ధానికి. ఇక్కడ చావు నన్ను వెంటాడుతుంది. అది ఎటు నుంచి వస్తుందో, ఎప్పుడోస్తుంది, ఎలా వస్తుందో నాకు తెలియదు. తెలుసుకోవాలని కూడా లేదు. ఎందుకంటే నా చేతిలో ఉన్న ఆయుధం ఒక నిజం. నిజం ఒక ధైర్యం. నిజం ఒక సైన్యం. యస్ దట్ ట్రూత్ ఇన్ మై కస్టడీ’ అంటూ నాగచైతన్య డైలాగ్స్ గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. టీజర్‌తోనే సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ అయ్యాయి. ముఖ్యంగా ఇళయరాజా, యువన్ శంకర్రాజాల బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఓ ట్రాన్స్‌లోకి తీసుకెళ్లింది.
ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీలో నాగ చైతన్యకు జోడీగా కృతిశెట్టి నటిస్తుంది. ప్రతి నాయకుడి పాత్రలో అరవింద్ స్వామి నటిస్తున్నాడు. నటి ప్రియమణి కీలకపాత్ర పోషిస్తుంది. ఈ సినిమా సమ్మర్ కానుకగా మే 12న తెలుగుతో పాటు తమిళంలోనూ ఏకకాలంలో విడుదల కానుంది.