Custody Movie Latest Update | మరో నెల రోజుల్లో నాగచైతన్య కస్టడీ సినిమా విడుదల కానుంది. నాగచైతన్య కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా ఇదే. ఈ సినిమాలో చై కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్ సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేశాయి. పైగా మానాడు వంటి బ్లాక్‌బస్టర్‌ను తెరకెక్కించిన వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో అంచనాలు తారా స్థాయికి చేరాయి. ద్విభాషా సినిమాగా రూపొందిన కస్టడీ మే 12న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం ఇప్పటి నుంచే అప్డేట్లను ఇవ్వడం స్టార్ట్ చేసింది. కాగా తాజాగా మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ సింగిల్ అప్డేట్ను ప్రకటించింది.
ఈ సినిమా ఫస్ట్ సింగిల్ అప్డేట్ను త్వరలో వెల్లడించనున్నట్లు ఓ చిన్న గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఈ సినిమాకు ఇళయరాజా, యువన్ శంకర్‌రాజా ఇద్దరూ స్వరాలు అందిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. నాగచైతన్యకు జోడీగా కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తుంది. అరవింద్ స్వామి ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. నటి ప్రియమణి కీలకపాత్ర పోషిస్తుంది. ఇక ఈ సినిమాకు నాన్-థియేట్రికల్ హక్కుల రూపంలో భారీ స్థాయిలోనే ఆఫర్స్ వస్తున్నాయని సమాచారం. అంతేకాకుండా నాగచైతన్య మార్కెట్‌కు రెండు రెట్లు అధికంగా బిజినెస్ జరుగుతుందని మేకర్స్ తెలుపుతున్నారు.
Prepare for the Musical Feast ❤️🔥#Custody First Single Update Firing Soon🔥🎯
Stay Tuned @SS_Screens ⏳#CustodyOnMay12@chay_akkineni @vp_offl @realsarathkumar @thearvindswami @IamKrithiShetty @srinivasaaoffl @ilaiyaraaja @thisisysr @srkathiir @jungleemusicSTH pic.twitter.com/jB3XG1uYpN
— Srinivasaa Silver Screen (@SS_Screens) April 6, 2023