నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న ఈ సినిమాకు వెంకట్‌ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఏ వెంకట్‌ప్రభు హంట్’ ఉపశీర్షిక. సీనియర్ నటుడు అరవింద్‌స్వామి ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం మే 12న ప్రేక్షకుల ముందుకురానుంది. తాజాగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.
యాక్షన్ అంశాలతో తీర్చిదిద్దిన ఈ వీడియోలో నాగచైతన్య పవర్‌ఫుల్‌గా కనిపించారు. ఇళయరాజా, యువన్‌శంకర్‌రాజా నేపథ్య సంగీతం ప్రధానాకర్షణగా నిలిచింది. ‘నాగచైతన్య కెరీర్లోనే భారీ చిత్రమిది. ఇందులో ధర్మాగ్రహంతో రగిలిపోయే శక్తివంతమైన పోలీస్ అధికారిగా నాగచైతన్య కనిపిస్తారు’ అని చిత్రబృందం పేర్కొంది. కృతిశెట్టి, ప్రియమణి, శరత్‌కుమార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎస్ఆర్ కతీర్, సంభాషణలు: అబ్బూరి రవి, నిర్మాత: శ్రీనివాస చిట్టూరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకట్‌ప్రభు.