Naga Chaitanya | ఈ మధ్య రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్‌కు గురవుతున్న విషయం తెలిసిందే. రీసెంట్గా నటి నయనతార ఎక్స్ అకౌంట్ హ్యాక్‌కు గురికాగా తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో సోషల్ మీడియా ఖాతా హ్యాక్‌కు గురయినట్లు తెలుస్తుంది. టాలీవుడ్ నటుడు అక్కినేనే నాగ చైతన్య ఎక్స్ ఖాతా హ్యాక్‌కు గురయినట్లు సమాచారం.
కొన్ని నిమిషాల క్రితం నాగ చైతన్య ఖాతా నుంచి ఒక పోస్ట్ వచ్చింది. ఆ పోస్ట్‌లో నేను 2013లో 50 అమెరికన్ డాలర్లు పెట్టి 100 బిట్ కాయిన్లు కొన్నాను. ఇప్పుడు వాటి విలువ 6 మిలియన్లు డాలర్లు అయ్యింది. ఇవి ఎవరికైన బహుమతి ఇవ్వడం గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఓటు వేయండి 🙂 అంటూ పోస్ట్ చేశాడు. అయితే దీనిపై నెటిజన్లు కొందరూ ఏమో వావ్ అన్న అంటూ చైతూని పొగుడుతుండగా.. మరికొందరు ఈ అకౌంట్ హ్యాక్ అయ్యింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా దీనిపై నాగా చైతన్య క్లారిటీ ఇవ్వవలసి ఉంది.
Naga Chaitanya