Naga Chaitanya Next Movie | అక్కినేని నటవారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన నటన, అభినయంతో ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అక్కినేని నాగచైతన్య. రొటీన్‌కు భిన్నంగా కథలను ఎంచుకుంటూ సినీరంగంలో దూసుకుపొతున్నాడు. ‘లవ్‌స్టోరి’, ‘బంగార్రాజు’ వంటి రెండు వరుస విజయాలతో టైర్-2 హీరోలలో టాప్ ప్లేస్‌లో నిలిచాడు. ప్రస్తుతం ఈయన నటించిన లేటెస్ట్ చిత్రం ‘థాంక్యూ’. విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 22న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ప్రమోషన్లో భాగంగా నాగచైతన్య పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. తాజాగా ఈయన నెక్స్ట్ చిత్రానికి సంబంధించిన బిగ్ అప్డేట్ను తెలిపాడు.
ప్రస్తుతం నాగచైతన్య ‘ధూత’ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నాడు. దీని తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో ద్విభాష చిత్రాన్ని చేయబోతున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ అయ్యాయి. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళనుంది. కాగా ఈ చిత్రంలో నాగచైతన్య పోలీస్ అధికారిగా నటించబోతున్నట్లు తనే స్వయంగా చెప్పాడు. గతంలో నాగచైతన్య ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంలో పోలీస్ అధికారిగా నటించాడు. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేపోయింది. ఇక ‘థాంక్యూ’ చిత్రంలో నాగచైతన్యకు జోడీగా రాశీఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీ.సీ శ్రీరామ్ ఛాయగ్రహకుడిగా పనిచేశాడు. శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌లు నిర్మించారు.