Vijayawada Kanaka durga temple | టాలీవుడ్ నటుడు నాగచైతన్య, దర్శకుడు చందూ మొండేటి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. తండేల్ సినిమా విజయం అందుకోవడంతో దర్శనానికి వచ్చిన నాగ చైతన్యకు అర్చకులు, సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం పండితులు ఆయనకు వేదాశీర్వచనాలిచ్చారు. తీర్థ ప్రసాదాలను అందజేశారు.
నాగచైతన్య చందూ మొండేటి కాంబోలో వచ్చిన తాజా చిత్రం తండేల్. సాయిపల్లవి కథానాయికగా నటించిన ఈ సినిమాను గీత ఆర్ట్స్ నిర్మించింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే శ్రీకాకుళంకి చెందిన కొందరూ జాలర్లు చేపల వేటకోసమని గుజరాత్ వెళ్లి ఇండియా బోర్డర్ దాటి పాకిస్థాన్‌కి ప్రవేశిస్తారు. దీంతో పాకిస్థాన్ కోస్ట్‌గార్డులు వారిని అరెస్ట్ చేసి పాకిస్తాన్ జైలుకు తరలిస్తారు. దీనినే సినిమాగా మలిచాడు దర్శకుడు చందూ.