Naga Chaitanya Movie | యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నేడు తన పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న 24వ చిత్రం (NC24) నుంచి టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ‘విరూపాక్ష’ ఫేమ్ దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్టుకు ‘వృషకర్మ’ అనే పవర్ ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు చేతుల మీదుగా నాగ చైతన్య ఫస్ట్ లుక్‌తో కూడిన టైటిల్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. అనంతరం మహేశ్ బాబు చైతన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ లుక్ బాగుందని ప్రశంసించారు. సంస్కృత మూలాలు ఉన్న ‘వృషకర్మ’ అనే పదానికి కార్యసాధకుడు (చేసే పనిపై శ్రద్ధ ఉన్నవాడు, దానిని సాధించేవాడు) అని అర్థం. ఈ టైటిల్, సినిమాలో చైతన్య పాత్ర స్వభావానికి సరిగ్గా సరిపోయేలా ఉందని చిత్ర యూనిట్ తెలిపింది.
ఈ చిత్రం మైథలాజికల్ థ్రిల్లర్ (Mythological Thriller) జానర్లో రూపొందుతోంది. గతంలో ‘విరూపాక్ష’తో దర్శకుడు కార్తీక్ దండు సృష్టించిన మిస్టికల్ థ్రిల్లర్ తరహాలోనే, ఈ సినిమాలో కూడా అద్భుతమైన విజువల్స్, ఉత్కంఠభరిత కథనం ఉండబోతోందని సమాచారం. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్నారు. ‘కాంతారా’ ఫేమ్ అజనీష్ బి లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండగా, ప్రముఖ దర్శకుడు సుకుమార్ రైటింగ్స్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామిగా ఉంది. బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
#VRUSHAKARMA it is for #Nc24 .@karthikdandu86 has something special coming your way for sure !
@Meenakshiioffl @BvsnP @aryasukku #SparshShrivastava #RagulDHerian @AJANEESHB @Srinagendra_Art @NavinNooli @SVCCofficial @SukumarWritings @Vrushakarma @Tseries @TseriesSouth pic.twitter.com/fwZbl0qxtO
— chaitanya akkineni (@chay_akkineni) November 23, 2025