Naga Chaitanya | టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం తండేల్. సాయి పల్లవి కథనాయికగా నటిస్తుండగా.. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ దీన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ గ్లింప్స్ విడుదల చేశారు.
ఎసెన్స్ ఆఫ్ తండేల్ (Essence Of Thandel) అంటూ ఈ గింప్ల్స్ విడుదల చేయగా.. వీడియోతోనే కథ చేప్పేశాడు దర్శకుడు.
బతుకుదెరువు కోసం గుజరాత్‌లోని వీరవల్‌కు వెళ్లిన నాగ చైతన్య సముద్రవేట చేస్తూ పాకిస్థాన్ కోస్టుగార్డులకు చిక్కుతాడు. అయితే పాకిస్థాన్ జైలు నుంచి అతడు ఎలా బయటపడ్డాడు అనే స్టోరీతో ఈ సినిమా రానుంది. ఇక ఇందులోనే కొంచెం ప్రేమ కథ, దేశభక్తి అంశాలు జోడించి కమర్షియల్ గా తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా చివరిలో.. బుజ్జితల్లి వచ్చేస్తున్న కదే.. కాస్తా నవ్వవే అంటూ చైతూ వాయిస్ రాగా సాయి పల్లవి కనిపించడం గ్లింప్స్‌కే హైలెట్‌గా నిలిచింది.
యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తుంది. కాగా ఈ మూవీ కోసం నాగ చైతన్య బాడీ ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మూవీ కోసం చైతూ లుక్ మార్చి.. గడ్డం, జుట్టు పెంచి అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నాడు.