Naga Chaitanya- Sobhita |అక్కినేని హీరో నాగ చైతన్య మొదట సమంతని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కాని కొన్ని కారణాల వలన ఈ జంట విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత నాగ చైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అమెజాన్ ప్రైమ్ నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో నాగ చైతన్య, శోభిత మొదటిసారిగా కలుసుకున్నారని, ఆ తర్వాత పరిచయం క్రమంగా స్నేహంగా మారి, అనంతరం ప్రేమగా చిగురించిందట. ఇరు పెద్దల అనుమతితో పెళ్లిపీటలు ఎక్కారు. ఇక పెళ్లైనప్పటి నుండి సరదాగా చెట్టాపట్టాలు వేసుకుంటూ తిరుగుతున్నారు. సోషల్ మీడియాలో వారికి సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి వినోదం పంచుతున్నారు.
శోభితతో పెళ్లి తర్వాత నాగ చైతన్య నటించిన తండేల్ చిత్రం విడుదలై పెద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. పెళ్లయిన తర్వాత శోభిత వచ్చిన వేళా విశేషమంటూ అక్కినేని అభిమానులు సంబరాలు తెగ సంబరాలు చేసుకున్నారు. తండేల్ చిత్రం అక్కినేని కుటుంబంలో పండగ వాతావరణం తీసుకు రాగా, దానిని ఇలానే కంటిన్యూ చేయాలని చైతూ భావిస్తున్నాడు. ఇక తండేల్ తర్వాత చైతూ ఏ సినిమాలో నటించనున్నాడు అనే ఆసక్తి అందరిలో ఉండగా, ఆయన విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో చేయనున్నట్టు తెలుస్తుంది. ఇక మూవీకి క్రియేటివ్ జీనియస్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఇక నాగ చైతన్య హీరోగా నటిస్తూనే మరో వైపు బిజినెస్ రంగంలోను రాణించాలని అనుకుంటున్నారు. ఇప్పటికే ఆయన తండ్రి నాగార్జున ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రిలో మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్మెన్లలో ఒకరు అని అనిపించుకున్నారు నాగార్జున. అన్నపూర్ణ స్టూడియోస్, ఎన్ కన్వెన్షన్‌తో పాటు నాగార్జునకు అనేక వ్యాపారాలు ఉన్నాయి. పలు సంస్థలలో కూడా పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు ఆయనని ప్రేరణగా తీసుకున్న నాగ చైతన్య స్కుజి పేరుతో తాము కొత్తగా ఫుడ్ బిజినెస్ ప్రారంభించినట్లుగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రుచులను పరిచయం చేయడానికి షోయుని పరిచయం చేస్తున్నట్లు చైతూ తెలిపారు. మీ ప్రేమ, ఆదరణ మాపై ఉండాలని నాగచైతన్య సుదీర్ఘంగా పోస్ట్ పెట్టారు. అలాగే కిచెన్‌ను, అక్కడ తయారవుతున్న వెరైటీలకి సంబంధించి పలు ఫొటోలని కూడా షేర్ చేశాడు. చైతూ, శోభితల పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.