వైవాహిక బంధం నుంచి విడిపోయిన తర్వాత ప్రొఫెషనల్ కెరీర్‌పై ఫోకస్ పెట్టారు అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya), సమంత (Samantha ).. ఈ ఇద్దరు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే నాగచైతన్య బిజీ షెడ్యూల్ మెయింటైన్ చేస్తూనే.. వీలు దొరికినప్పుడల్లా మరో భామతో చెట్టాపట్టాలేసుకుని కనిపిస్తూ నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతున్నాడు. ఇంతకీ ఆ భామ ఎవరో ఇప్పటికే ఊహించి ఉంటారు. ఆమెనే నటి శోభితా ధూళిపాళ (Sobhita Dhulipala).
ఈ ఇద్దరు కలిసి కనిపించిన ఫొటోలు ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తూ.. డేటింగ్లో ఉన్నారనే వార్తలకు ఊతమిచ్చాయి. అయితే ఈ న్యూస్‌పై మాత్రం ఇద్దరూ ఎలాంటి కామెంట్ చేయలేదు. ఇదిలా ఉంటే లండన్ రెస్టారెంట్‌కు సంబంధించిన ఫొటో ఒకటి డేటింగ్ వార్తలకు మరింత బలం చేకూరుస్తుంది. చైతూ, శోభితా ధూళిపాళ లండన్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన సమయంలో.. చైతూతో చెఫ్ ఫొటో దిగాడు. ఈ ఇద్దరి వెనకాల డిన్నర్ టేబుల్ దగ్గర కూర్చున్న శోభితా ధూళిపాళ తన ముఖం కనిపించకూడదన్నట్టుగా చేయి అడ్డం పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఈ ఫొటోతో ఇద్దరూ రిలేషన్షిప్లో ఉన్నది నిజమేనని తెగ చర్చించుకుంటున్నారు. మరి చైతూ, శోభితా డేటింగ్ వార్తలపై ఏమైనా స్పందిస్తారా..? అనేది తెలియాల్సి ఉంది.
నాగచైతన్య ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న కస్టడీలో నటిస్తున్నాడు. ఉప్పెన ఫేం కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం మేలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శోభితా ధూళిపాళ ప్రస్తుతం తమిళంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ పొన్నియన్ సెల్వన్ -2లో నటిస్తోంది. ఈ భామ పొన్నియన్ సెల్వన్ -1లో కూడా మెరిసింది. మరోవైపు హిందీలో సితార, అమెరికన్ ఫిల్మ్ మంకీ మ్యాన్‌లో కూడా నటిస్తోంది.
Ghantadi krishna | దర్శకుడిగా మారిన టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్.. వివరాలివే
Sai Pallavi | ముంబై ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్‌గా సాయిపల్లవి
Leo | స్పీడుమీదున్న విజయ్.. లియో కొత్త షెడ్యూల్ అప్డేట్