Leo | స్పీడుమీదున్న విజయ్.. లియో కొత్త షెడ్యూల్ అప్డేట్
విజయ్ (Vijay) నటిస్తోన్న చిత్రం లియో (Leo.. Bloody Sweet). లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్న లియో కొత్త షెడ్యూల్ అప్డేట్ వచ్చేసింది.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) నటిస్తోన్న తాజా చిత్రం లియో (Leo.. Bloody Sweet). లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే లియో కశ్మీర్ షెడ్యూల్ షూటింగ్ పూర్తయినట్టు తెలియజేస్తూ.. విడుదల చేసిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. తాజాగా లియో కొత్త షెడ్యూల్ అప్డేట్ వచ్చేసింది. ఏప్రిల్ మొదటి వారంలో లియో కొత్త షెడ్యూల్ చెన్నైలో ప్రారంభం కానుంది.
దళపతి 67 గా తెరకెక్కుతున్న లియో చిత్రంలో త్రిష ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ సంజయ్‌దత్, యాక్షన్ కింగ్ అర్జున్, ప్రియా ఆనంద్, మన్సూర్ అలీఖాన్, గౌతమ్ వాసు దేవ్‌మీనన్, మిస్కిన్, మాథ్యూ థామస్, సాండీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి లోకేశ్ కనగరాజ్, రత్నకుమార్, ధీరజ్ వైడీ సంభాషణలు రాస్తున్నారు.
మాస్టర్ సినిమా తర్వాత విజయ్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో లియోపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ ఏడాది వంశీపైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన వారసుడు చిత్రంతో ప్రేక్షకులను పలుకరించాడు విజయ్. వారసుడు తమిళంలో వారిసు టైటిల్‌తో విడుదలై హిట్‌గా నిలిచింది. తెలుగులో మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.
ఇప్పటికే విడుదల చేసిన లియో టైటిల్ గ్లింప్స్ వీడియో గూస్బంప్స్ తెప్పిస్తూ.. నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ సారి విజయ్ ను పక్కా మాస్ అవతార్‌లో చూపించబోతున్నట్టు గ్లింప్స్ వీడియోతో చెప్పేశాడు లోకేశ్ కగనరాజ్.
నెక్ట్స్ షెడ్యూల్ టైం ఫిక్స్..
#LEO next schedule begins in Chennai, April 1st week! pic.twitter.com/zkTrWBLCUS
— LetsCinema (@letscinema) March 28, 2023
కశ్మీర్ లొకేషన్లో త్రిష..
#Leo girl #Trisha Instagram Story From Kashmir 🥶❤️@actorvijay 👑 pic.twitter.com/03E5ft3Da2
— #Leo (@VijayFanCraze) February 18, 2023
లియో టైటిల్ ప్రోమో..
దళపతి 67 సర్ప్రైజ్..
Read Also:
Ghantadi krishna | దర్శకుడిగా మారిన టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్.. వివరాలివే
Dasara | నాని దసరా నుంచి ఓ అమ్మలాలో లిరికల్ వీడియో సాంగ్
Leo | స్పీడుమీదున్న విజయ్.. లియో కొత్త షెడ్యూల్ అప్డేట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

