Naga Chaitanya- Sobhita| ప్రస్తుతం టాలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో నాగ చైతన్య, శోభిత జంట ఒకటి.సమంత నుండి విడిపోయాక నాగ చైతన్య కొన్ని నెలల పాటు శోభితతో ప్రేమాయణం నడిపి గత ఏడాది వివాహం చేసుకున్నాడు. ఇక పెళ్ళైనప్పటి నుండి వీరిద్దరు చాలా సరదాగా గడుపుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్ రోల్ పోషించే శోభిత ఎప్పటికప్పుడు వాటికి సంబంధిచిన ఫోటోస్ షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి. ఈ జంట ఆమ్స్టర్డామ్ , మెక్సికోలలో వీధి వీధి తిరుగుతూ సరదాగా ఎంజాయ్ చేశారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ నుండి సాయంత్రం వరకు ఎలా గడిపారో ఫోటోల ద్వారా తన అభిమానులకు తెలియజేసింది.
అయితే తాజాగా ఈ జంట రేసింగ్ ట్రాక్‌పై సందడి చేసింది.తండేల్ సక్సెస్ తర్వాత నాగచైతన్య, శోభిత దంపతులు హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తుండగా, ఈ క్రమంలోనే కార్ రేసింగ్ ట్రాక్ వద్ద తమ డేను సరదాగా గడిపారు.చై, శోభిత కలిసి రేసింగ్ ట్రాక్‌లో గడిపిన క్షణాలను శోభిత సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. కాగా, చైతన్యకి రేసింగ్ అంటే చాలా ఇష్టం . అందుకే శోభితను సైతం అక్కడకు తీసుకెళ్లారు. ఆమెతో సరాదాగా రేసింగ్ కారు నడిపారు. అంతే కాదండోయ్.. నాగ చైతన్య తనకు ఇష్టమైన రేసింగ్ కారులో శోభితను కూర్చోబెట్టి ఫోటోలు దిగగా, ఇవి నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవలే ఈ కపుల్ యూరప్ ట్రిప్ ఎంజాయ్ చేశారు.
తేడాది డిసెంబర్ 4న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో శోభిత మెడలో మూడు ముళ్లు వేశాడు నాగ చైతన్య. ఓ ఇంటర్వ్యూలో ఆమెతో జీవితాన్ని పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని.. తనతో అన్ని విషయాలు పంచుకుంటానని, ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అయితే వెంటనే ఆమె సలహా తీసుకుంటానని నాగ చైతన్య స్పష్టం చేశారు. తండేల్ సక్సెస్ జోష్ లో ఉన్న నాగ చైతన్య ఇప్పుడు చాలా జోష్‌తో కనిపిస్తున్నారు. భార్య శోభితని తీసుకొని పలు ప్రాంతాలకి తిరుగుతున్నాడు. ఈ కొత్త జంటను ఇలా చూసి అక్కినేని ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. క్యూట్ కపుల్ ఎంజాయ్ చేయండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.