Naga Chaitanya- Samantha | ఒకే వేదికపై సమంత-నాగచైతన్య.. సిమ్రాన్ నారంగ్ రిసెప్షన్లో అరుదైన దృశ్యం
Naga Chaitanya- Samantha | హైదరాబాద్‌లో జరిగిన ప్రముఖ వ్యాపారవేత్త, నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె సిమ్రాన్ నారంగ్ వివాహ రిసెప్షన్ వేడుక సినీ, రాజకీయ వర్గాల సమక్షంలో ఘనంగా జరిగింది. శనివారం సాయంత్రం నిర్వహించిన ఈ వేడుకకు టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు హాజరై సందడి చేశారు.
Naga Chaitanya- Samantha | హైదరాబాద్‌లో జరిగిన ప్రముఖ వ్యాపారవేత్త, నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె సిమ్రాన్ నారంగ్ వివాహ రిసెప్షన్ వేడుక సినీ, రాజకీయ వర్గాల సమక్షంలో ఘనంగా జరిగింది. శనివారం సాయంత్రం నిర్వహించిన ఈ వేడుకకు టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు హాజరై సందడి చేశారు. ముఖ్యంగా చిరంజీవి, నాగార్జున వంటి అగ్ర తారలు విచ్చేసి కొత్త దంపతులను ఆశీర్వదించారు. ఈ వేడుకలో మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మాజీ జంట సమంత మరియు నాగ చైతన్య ఒకే వేదికపై కనిపించడం. విడిపోయిన తర్వాత ఈ ఇద్దరూ ఒకే కార్యక్రమానికి హాజరు కావడం అరుదైన విషయం కావడంతో అందరి దృష్టి వారిపైనే నిలిచింది.
సమంత తన భర్త, దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి వేడుకకు హాజరయ్యారు. ఆమె ఊదా రంగు చీరలో మెరిసిపోగా, రాజ్ ఫార్మల్ సూట్లో కనిపించారు. మరోవైపు నాగ చైతన్య తన భార్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో పాటు తండ్రి నాగార్జున, తల్లి అమలతో కలిసి కార్యక్రమానికి వచ్చారు. శోభితా నీలం-గులాబీ రంగు చీరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేదికపై కొత్త జంటను ఆశీర్వదించే సమయంలో నాగ చైతన్య-శోభిత జంట కెమెరా కళ్లకు చిక్కగా, సమంత-రాజ్ జంట కూడా ప్రత్యేకంగా కనిపించింది. అయితే సమంత, నాగ చైతన్య ఒకరినొకరు పలకరించుకున్నారా లేదా అన్నది మాత్రం స్పష్టంగా తెలియలేదు. ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
“వీరిద్దరూ కలిశారా?”, “మాట్లాడుకున్నారా?” అంటూ అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు వారిద్దరూ కలిసి కనిపించిన ఫోటోలు లేదా వీడియోలు బయటకు రాకపోవడంతో ఈ విషయం ఇంకా మిస్టరీగానే మిగిలింది. అదే సమయంలో నెటిజన్లు మాత్రం గతాన్ని పక్కన పెట్టి ఇద్దరూ తమ జీవితాల్లో ముందుకు సాగడం మంచి విషయమని అభిప్రాయపడుతున్నారు. గతంలో ఏ మాయ చేసావె సినిమాతో పరిచయమైన సమంత-నాగ చైతన్య 2017లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కానీ వ్యక్తిగత కారణాల వల్ల 2021లో విడిపోయారు. అనంతరం నాగ చైతన్య 2024లో శోభితను వివాహం చేసుకోగా, సమంత 2025లో రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్నారు.ప్రస్తుతం నాగ చైతన్య ‘వృషకర్మ’ అనే సోషియో ఫాంటసీ హారర్ థ్రిల్లర్‌తో బిజీగా ఉండగా, సమంత ‘మా ఇంటి బంగారం’, ‘రక్త బ్రహ్మాండం’ వంటి ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
Vishvajit More | వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం.. చరిత్ర సృష్టించిన యువ రెజ్లర్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

