Naga Chaitanya| అక్కినేని మూడో వారసుడు నాగ చైతన్య ఈ మధ్య కాలంలో తెగ హాట్ టాపిక్ అవుతున్నాడు. పెళ్లిళ్లు, సినిమాలతో చైతూ పేరు మారుమ్రోగిపోతుంది. ముందుగా చైతూ ఏ మాయ చేశావే సినిమా సమయంలో సమంతతో ప్రేమలో పడి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లు మంచిగానే ఉన్న ఈ జంట 2021లో విడాకులు తీసుకున్నారు.వారి నిర్ణయం అందరిని ఆశ్చర్యపరచింది. అసలు ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఈ విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏంటనేది ఇప్పటికీ ఎవరికి తెలియదు.
ఇక సమంత నుండి విడిపోయిన తర్వాత కొన్నాళ్ల పాటు సింగిల్‌గా ఉన్న నాగ చైతన్య మరో టాలీవుడ్ నటి శోభిత ధూళిపాళ్లతో ప్రేమాయణం నడిపి ఆమెని పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లి అన్నపూర్ణ స్టూడియోలో అట్టహాసంగా జరిగింది. ఇక ఈ జంట కూడా అడపాదడపా తళుక్కున మెరుస్తూ అందరిని దృష్టిని ఆకర్షిస్తున్నారు. అయితే నాగ చైతన్యని రానా ఇంటర్వ్యూ చేసిన పాత వీడియో ఒకటి నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. ఇందులో రానా.. చైతూని తొలి ముద్దు అనుభవం గురించి అడగగా, తాను తొమ్మిదో తరగతిలోనే మొదటి ముద్ద ఇచ్చిన విషయాన్ని బయటపెట్టారు.
అప్పుడు ఇచ్చిన ఆ ముద్దు నా జీవితమంతా పని చేసింది అంటూ నవ్వుతూ నాగ చైతన్య చెప్పుకు రావడం విశేషం. ఇక ఇదే సమయంలో ఓ అభిమాని తనతో ..సమంత కంటే మీరే తెల్లగా ఉన్నారని చెప్పిందట. ఇది తనకు జీవితాంతం గుర్తుండే జ్ఞాపకం అని కూడా చైతూ అన్నారు. అయితే ఈ ఇంటర్య్వూ జరిగే సమయానికి నాగ చైతన్య, సమంత కలసే ఉన్నారు. .2017లో పెళ్లి చేసుకున్న ఈ జంట, 2021లో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. వీరి విడాకుల ప్రకటన రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఇక సమంత, చైతూ విడిపోయాక చైతూ రెండో వివాహం చేసుకున్నా, సమంత మాత్రం ఇంకా సింగిల్‌గానే ఉంది.