Naga Chaitanya | తెలుగు చిత్ర పరిశ్రమకి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ రెండు కళ్లు లాంటి వారు. వారి కొడుకులే కాకుండా మనవలు కూడా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఇక ఏఎన్ఆర్ మనవడు నాగ చైతన్య స్లో అండ్ స్టడీగా సినిమాలు చేస్తూ అదరగొడుతున్నాడు. ఇటీవల తండేల్ చిత్రంతో పెద్ద హిట్ కొట్టాడు. గతంలో ఎన్టీఆర్-ఏఎన్ఆర్ కలిసి పలు సినిమాలు చేశారు. తర్వాతి తరంలో హరికృష్ణ- నాగార్జున కలిసి నటించారు. ఇక ఈ జనరేషన్లో జూనియర్ ఎన్టీఆర్ – నాగ చైతన్య కలిసి నటిస్తే చూడాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
అయితే ఎన్టీఆర్ ఇటీవల దేవర మూవీ ప్రమోషన్ కోసం జపాన్ వెళ్లిన విషయం తెలిసిందే. ‘దేవర’ సినిమా జపాన్‌లో మార్చి 28వ తేదీన విడుదల అయ్యింది. ఈ మూవీ ప్రమోషన్ కోసం అక్కడికి వెళ్లిన ఎన్టీఆర్ పలు ఇంటర్వ్యూలలో పాల్గొని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. డైరెక్టర్ శివ కొరటాలతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎన్టీఆర్.. నాగచైతన్య గురించి ఆయన రెస్టారెంట్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. తాను జపాన్ ఫుడ్ ని చాలా ఇష్టంగా తింటానని, హైదరాబాదులో జపాన్ ఫుడ్ తినాలని అనిపిస్తే కచ్చితంగా ‘షోయు’ రెస్టారెంట్ కి వెళతానని చెప్పుకొచ్చాడు. ఆ రెస్టారెంట్ నా స్నేహితుడు, నటుడు నాగచైతన్యది. ఆ రెస్టారెంట్లో మనకు చాలా రకాల జపాన్ ఫుడ్స్ లభిస్తాయి. అందులో సుషీ అనే జపనీస్ ఫుడ్ అంటే నాకు ఎంతో ఇష్టం అమేజింగ్‌గా ఉంటుందని తెలియజేశాడు.
అప్పుడు ఎన్టీఆర్ చేసిన కామెంట్స్‌కి రీసెంట్ ఇంటర్వ్యూలో నాగ చైతన్య స్పందించాడు. ఎన్టీఆర్ తన సినిమా ప్రమోషన్ కోసం జపాన్‌కి వెళ్లిఆ సమయంలో మా రెస్టారెంట్ గురించి మాట్లాడడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు నాగ చైతన్య. ఎన్టీఆర్‌కి సంబంధించిన వీడియో చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యాను. ప్రీమియం క్లౌడ్ కిచెన్ పెట్టాలనే ఆలోచన నాకు లాక్ డౌన్ సమయంలోనే వచ్చింది. అలా తమ రెస్టారెంట్ ప్రారంభమైందని చెప్పుకొచ్చాడు చైతూ. ఇక ఇప్పుడు తమ రెస్టారెంట్ విజయవంతంగా నడుస్తోందని చైతన్య పేర్కొన్నారు.