Custody| టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య (Naga Chaitanya) నటిస్తోన్న బై లింగ్యువల్ ప్రాజెక్ట్ కస్టడీ (Custody). వెంకట్ ప్రభు (Venkat Prabhu) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. తెలుగు, తమిళ భాషల్లో NC 22గా వస్తున్న ఈ సినిమా నుంచి ఇ్పటికే విడుదలైన గ్లింప్స్ వీడియో, టీజర్, ప్రీ లుక్ ఫస్ట్ లుక్కు మంచి స్పందన వస్తోంది. కాగా తాజాగా మేకర్స్ కస్టడీ ట్రైలర్ అప్డేట్ అందించారు. వేటాడే సీజన్ మొదలైంది.. కస్టడీ ట్రైలర్ మే 5న విడుదల కాబోతుంది..అని కొత్త లుక్ లాంఛ్ చేస్తూ ట్రైలర్ అప్డేట్ అందించారు.
తాజా లుక్‌లో నాగచైతన్య కుడి చేతికి బేడీలుండగా.. ఎడమ చేతిలో పిస్తోల్ పట్టుకుని కనిపిస్తున్నాడు. ఈ లుక్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. కస్టడీ నుంచి ఇప్పటికే టైమ్‌లెస్ లవ్ (Timeless Love), హెడ్ అప్ హై లిరికల్ వీడియో సాంగ్స్ కు మంచి స్పందన వస్తోంది. బంగార్రాజు తర్వాత కృతిశెట్టి మరోసారి నాగచైతన్యకు జోడీగా నటిస్తోంది. కస్టడీలో నాగచైతన్య పోలీసాఫీసర్ శివగా కనిపించబోతున్నాడు. కస్టడీలో అరవింద్ స్వామి విలన్‌గా నటిస్తున్నాడు. వెన్నెల కిశోర్, శరత్‌కుమార్, ప్రేమ్గీ అమరేన్, సంపత్ రాజ్, ప్రియమణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. కస్టడీకి మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. మే 12న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది కస్టడీ. నాగచైతన్య గతేడాది లాల్ సింగ్ చడ్డా సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కస్టడీతో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు.
The Hunting Season Begins 🔥#CustodyTrailer Explodes on May 5th!❤️🔥#CustodyOnMay12@chay_akkineni @vp_offl @realsarathkumar @thearvindswami @ilaiyaraaja @thisisysr @IamKrithiShetty @srinivasaaoffl @SS_Screens pic.twitter.com/7aDFqqpj1L
— Srinivasaa Silver Screen (@SS_Screens) May 1, 2023
Timeless Love లిరికల్ వీడియో సాంగ్..
హెడ్ అప్ హై లిరికల్ వీడియో సాంగ్..
స్టడీ గ్లింప్స్ వీడియో..
నాగచైతన్య కస్టడీ టీజర్ టీజ్..
కస్టడీ టీజర్..
Balagam | భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్కు ఫిదా.. బలగం ఖాతాలో మరో పురస్కారం
Gaami | విశ్వక్ సేన్ గామి అప్డేట్ ఇచ్చిన చాందినీ చౌదరి