కొత్తదనంతో కూడిన కథాంశాలతో ప్రేక్షకులను పలుకరించే హీరోల్లో ముందు వరుసలో ఉంటాడు అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya). ఈ యంగ్ హీరో నటిస్తున్న తాజా చిత్రం కస్టడీ (Custody). వెంకట్ ప్రభు (Venkat Prabhu) డైరెక్షన్లో NC 22గా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది.
ముందుగా వచ్చిన అప్డేట్ ప్రకారం నూతన సంవత్సర కానుకగా కస్టడీ క్రేజీ అప్డేట్ అందించారు మేకర్స్. గ్లింప్స్ వీడియోను మేకర్స్ లాంఛ్ చేశారు. ఛేజింగ్, యాక్షన్ సన్నివేశాలతో సాగుతున్న గ్లింప్స్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రంలో కృతిశెట్టి మరోసారి నాగచైతన్యకు జోడీగా నటిస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్లు ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.
ఈ చిత్రంలో శివ అనే పోలీసాఫీసర్‌గా నాగచైతన్య కనిపించనున్నాడు. కస్టడీ మూవీలో అరవింద్ స్వామి విలన్‌గా నటిస్తుండగా.. వెన్నెల కిశోర్, శరత్‌కుమార్, ప్రేమ్గీ అమరేన్, సంపత్ రాజ్, ప్రియమణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.
కస్టడీ గ్లింప్స్ వీడియో..
𝐁𝐄𝐇𝐎𝐋𝐃!🔥
The Raging Blast on this New Year 🤩
A Small #CustodyGlimpse for the Magnanimous Beginning 🌟
A @vp_offl HUNT💥@chay_akkineni @IamKrithiShetty @thearvindswami @ilaiyaraaja @thisisysr @srinivasaaoffl @realsarathkumar @SS_Screens pic.twitter.com/LoqYPb4fAs
— Srinivasaa Silver Screen (@SS_Screens) January 1, 2023