Custody | అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ కస్టడీ (Custody). కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వం వహించాడు. NC 22గా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం మే 12న థియేటర్లలో గ్రాండ్‌గా విడులైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాను థియేటర్లలో చూడలేని వారి కోసం ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.
కస్టడీ డిజిటల్ స్ట్రీమింగ్ న్యూస్ బయటకు వచ్చింది. కస్టడీ జూన్ 9న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. థ్రిల్లింగ్ హంట్.. ఇప్పుడు మీ ఇండ్లలోకి వస్తోంది..అంటూ మేకర్స్ అప్డేట్ అందించారు. మరి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది తెలియాల్సి ఉంది. కస్టడీ గ్లింప్స్ వీడియో, టీజర్, ట్రైలర్ ఛేజింగ్, యాక్షన్ సన్నివేశాలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. నాగచైతన్య ఈ చిత్రంలో కానిస్టేబుల్ శివగా నటించాడు. కృతిశెట్టి బంగార్రాజు తర్వాత మరోసారి నాగచైతన్యకు జోడీగా నటించింది.
కస్టడీలో అరవింద్ స్వామి విలన్‌గా నటించగా.. వెన్నెల కిశోర్, శరత్‌కుమార్, ప్రేమ్గీ అమరేన్, సంపత్ రాజ్, ప్రియమణి కీలక పాత్రల్లో నటించారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.
The Thrilling HUNT is now coming to your Homes!❤️🔥#Custody will be streaming on @PrimeVideoIN from June 9th!🍿#CustodyOnPrime@chay_akkineni @vp_offl @realsarathkumar @IamKrithiShetty @thearvindswami @ilaiyaraaja @thisisysr #Priyamani @srinivasaaoffl @SS_Screens pic.twitter.com/qvXaBhjNGx
— Ramesh Bala (@rameshlaus) June 7, 2023