Naga Chaitanya – Negative PR | తండేల్ సినిమాతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగచైతన్య ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఒక ఇంటర్వ్యూలో పాల్గోన్న చైతూ.. పీఆర్ (పబ్లిక్ రిలేషన్స్) యాక్టివిటీకి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశాడు. కొందరూ కావాలని పక్కనోడిని పక్కనోడిని తొక్కేయడానికి నెగెటివ్ పీఆర్లూ రన్ చేస్తున్నట్లు చైతూ వెల్లడించారు.
నేను పీఆర్ గేమ్‌లోకి ఆలస్యంగా ఎంటర్ అయ్యాను. నా సొంత ప్రపంచంలో బ్రతుకుతూ ఉండేవాడిని. సినిమా కోసం వర్క్ చేశామా.. ఇంటికి వెళ్లామా.. మన లైఫ్ మనం చూసుకున్నామా అన్నట్లు ఉండేవాడిని నాకు పాలిటిక్స్ కూడా తెలియదు. అయితే గత 2 ఏండ్ల నుంచి పీఆర్ (పబ్లిక్ రిలేషన్స్) యాక్టివిటీ చాలా ఎక్కువగా మారింది. ఇది ఎలా మారింది అంటే ఒక నెలకి కనీసం రూ. 2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు పీఆర్ మీద ఖర్చు పెట్టకుంటే నువ్వు సరిగ్గా లేవని అర్థం. అలాగే సినిమా విడుదల సమయానికి వచ్చేసరికి తప్పకుంగా పీఆర్ కోసం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అయితే ఇది సినిమాను ప్రజలలోకి తీసుకువెళ్లేలా ఉండాలి. కానీ ఈ మధ్య పీఆర్ ఎలా ఉందంటే.. కొంతమంది నెగిటివ్ పీఆర్లూ చేస్తున్నారు. కావాలని పక్కనోడిని తొక్కేయడానికి నెగిటివ్ పీఆర్లూ రన్ చేస్తున్నారు. ఇలాంటి పీఆర్లు నాకు అర్థంఅవ్వరు. మా మీదా చేసే నెగెటివ్ పీఆర్‌కి పెట్టే డబ్బులు మీకోసం వాడండి.. టూర్‌కి వెళ్లి ఎంజాయ్ చేయండి ఈ మధ్యనే కామెంట్ సీడింగ్ అనే పదం కూడా విన్నాను. ఒక పోస్ట్ పెడితే దాని కింద పెట్టే కామెంట్లకి కూడా నెగిటివ్ పీఆర్ ఉంటుందని తెలిసింది అంటూ నాగ చైతన్య చెప్పుకోచ్చాడు.