Naga Chaitanya | అక్కినేని వారింట మరోసారి పెండ్లి బాజాలు మోగనున్నాయా.. సమంతతో విడాకులు తీసుకున్న నాగచైతన్య (Naga Chaitanya) మరో పెండ్లికి సిద్ధమయ్యాడా..? ఓ హీరోయిన్‌తో చైతూ పీకల్లోతో ప్రేమలో మునిగిపోయాడని, వారిద్దరు చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారని గత కొంత కాలంగా జరుగుతున్న ప్రచారానికి నేటితో తెరపడనుందా.. అంటే అవుననే నెట్టింట తెగ ప్రచారం జరుగుతున్నది. నటి శోభితా ధూళిపాళ్లతో నాగచైతన్య (Naga Chaitanya- Sobhita Dhulipala) ఎంగేజ్మెంట్ జరుగనుందనీ.. అది కూడా గురువారమేనంటూ ఓ వార్త వైరలవుతున్నది. కొద్దిమంది సమక్షంలో ఇరువురు ఉంగరాలు మార్చుకోనున్నారని, త్వరలోనే హీరో నాగార్జున ఓ ప్రకట చేయనున్నాడని కొన్ని ప్రధాన వెబ్సైట్లు కూడా ప్రచురించాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందనే విషయమే తెలియాల్సి ఉన్నది. ఎందుకంటే ఇటు అక్కినేని ఫ్యామిలీ కానీ, అదు శోభిత కుటుంబం ఈ విషయమై ఎలాంటి ప్రకటనా రాకపోవడమే..!
2017లో నటి సమంతను నాగచైతన్య ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. అయితే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో కొంతకాలం దూరంగా ఉన్నారు. అనంతరం 2021 అక్టోబర్‌లో విడిపోతున్నట్టుగా ప్రకటించారు. అప్పటినుంచే చైతూ-శోభిత జంటపై రూమర్స్ వచ్చాయ్. ఇద్దరు లవ్‌లో పడ్డారని, డేటింగ్ చేస్తున్నట్టు కూడా చాలారోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే అది నిజమే అన్నట్టుగా ఇద్దరు కలిసి ఉన్న వెకేషన్ పిక్స్ బయటికి కూడా వచ్చాయి. ఇప్పుడు ఏకంగా నిశ్చితార్థం కన్ఫ్మామ్ అవడం ఇంట్రెస్టింగ్గా మారింది.
వీళ్లిద్దరూ రిలేషన్లో ఉన్నారు అని కొద్ది నెలల కిందట ఓ ఫోటో బయట పెట్టింది. చైతూతో ఓ చెఫ్ ఫొటో దిగారు. ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో శోభిత కనిపించారు. అప్పుడే వీళ్లిదరి పెండ్లి పక్కా అని అనుకున్నారు. అయితే అది ఇప్పుడు నిజం కానుందని వార్తలు వస్తున్నాయి. కాగా, వీరి ఎంగేజ్మెంట్పై నాగార్జున అధికారికంగా ఓ ప్రకటన చేస్తారని తెలుస్తున్నది.
ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలికి చెందిన శోభితా.. ముంబై యూనివర్సిటీ, హెచ్ఆర్ కాలేజీలో కామర్స్ అండ్ ఎకనామిక్స్ పూర్తిచేసింది. 2013లో మిస్ ఇండియా అందాల పోటీల్లో రెండో స్థానం సొంతం చేసుకున్నది. అనంతరం సినీరంగంలోకి ప్రవేశించింది. అనురాగ్ కశ్యప్ డైరెక్షన్లో రామన్ రాఘవ్ మూవీలో నటించింది. ఆ తర్వాత మేడ్ ఇన్ హెవెన్ సిరీస్‌లో ప్రధాన పాత్ర పోషించింది. తెలుగులో గూఢాచారి, మేజర్ సినిమాల్లో కనిపించింది. ఇక పొన్నియన్ సెల్వన్, ది నైట్ మేనేజర్ 2, కురుప్ కీలక పాత్రలు పోషించింది.
Naga Chaitanya and Sobhita spotted in Europe at a wine tasting few days ago 🍷👀
byu/Eternal-Wisdom-9999 inBollyBlindsNGossip