Naga Babu| మెగా బ్రదర్ నాగబాబుని ఇటీవల జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే నాగబాబు నామినేషన్ దాఖలు చేయగా, ఎమ్మెల్సీగా గెలుపు కూడా లాంఛనమే. త్వరలో నాగబాబుకి మంత్రి పదవి కూడా ఇవ్వనున్నారనే ప్రచారం నడుస్తుంది. అయితే ఇదే సమయంలో నాగబాబు ఎన్నికల కమిషన్ కు నాగబాబు సమర్పించిన తన అఫిడవిట్ అప్పులు, ఆస్తుల వివరాలు అన్ని ప్రకటించారు. ఇందులో అతను తన అన్న చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్ దగ్గర చేసిన అప్పుల గురించి కూడా ప్రస్తావించారు. ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అంత అప్పు ఎలా..
నాగబాబు అప్పుల వివరాలు.. చూస్తే 56.97 లక్షల హోసింగ్ లోన్ ఉంది. 7.54 లక్షల కార్ లోన్ ఉంది. 1.64 కోట్లు పలువురి దగ్గర అప్పుగా తీసుకున్నారు. అందులో చిరంజీవి వద్ద 28.48 లక్షల అప్పు చేయగా, పవన్ కళ్యాణ్ వద్ద కూడా 6.9 లక్షల అప్పు చేసారు. అయితే నాగబాబుకి ఇంత అప్పు చేయాల్సిన పరిస్థితి ఎప్పుడు వచ్చింది అని అందరు ఆలోచనలు చేస్తున్నారు. అయితే ఆరెంజ్ మూవీ షూటింగ్ సమయంలోనే నాగబాబు అప్పు చేశాడని, అందులో కొంత తీర్చాడని అప్పట్లో నెట్టింట వార్తలు హల్చల్ చేయడం మనం చూశాం.
ఇక నాగబాబు చరాస్తుల విలువ 59 కోట్లు కాగా, ఇందులోనాగబాబు దగ్గర బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్, నగదు కలిపి 59 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. చేతిలో నగదు – రూ.21.81 లక్షలు, బెంజ్ కారు –రూ.67.28 లక్షలు, హ్యుందాయ్ కారు – రూ.11.04 లక్షలు,బంగారం & వెండి – రూ.57.99 లక్షల విలువైన 724 గ్రాముల బంగారం, భార్య వద్ద 55 క్యారట్ల వజ్రాలు (రూ.16.50 లక్షలు), 20 కేజీల వెండి (రూ.21.40 లక్షలు), రంగారెడ్డి జిల్లాలో 2.39 ఎకరాల భూమి – రూ.5.3 కోట్లు, మెదక్ జిల్లా నర్సాపూర్‌లో 8.28 ఎకరాల భూమి – రూ.82.80 లక్షలు, రంగారెడ్డి జిల్లా టేకులాపల్లిలో 1.07 ఎకరాల భూమి – రూ.53.50 లక్షలు, హైదరాబాద్ మణికొండలో విల్లా – రూ.2.88 కోట్లు,మొత్తం స్థిరాస్తుల విలువ – రూ.11.20 కోట్లుగా ఉన్నాయని తెలుస్తుంది.