e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News Sreemukhi: శ్రీముఖి పాట‌కు స్పృహ కోల్పోయిన నాగబాబు.. వీడియో వైర‌ల్‌

Sreemukhi: శ్రీముఖి పాట‌కు స్పృహ కోల్పోయిన నాగబాబు.. వీడియో వైర‌ల్‌

ఈ మ‌ధ్య సెల‌బ్స్ సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తున్నారు. ప‌లు ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్స్‌కి కావ‌ల‌సినంత వినోదాన్ని పంచుతున్నారు. ఇలా వినోదం పంచుతున్న అందాల ముద్దుగుమ్మ‌ల‌లో శ్రీముఖి ఒక‌రు కాగా, ఈ అమ్మ‌డు తాజాగా నాగాబాబుతో ఫ‌న్నీ వీడియో చేసింది. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ ర‌చ్చ చేస్తుంది.

బుల్లితెర స్టార్ శ్రీముఖి, మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు తాజాగా ఓ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఖాళీ స‌మ‌యంలో వీరిద్ద‌రు ప‌క్క‌న ప‌క్క‌న కూర్చొని ముచ్చ‌ట్లు పెట్టుకుంటున్నారు. ఓ సంద‌ర్భంలో శ్రీముఖిని పాట పాడ‌మని అడిగాడు నాగ‌బాబు. దీంతో ఆమె గ‌ట్టిగా అరుస్తూ పాట పాడిన‌ట్టు చేసింది. దీంతో నాగ‌బాబు క‌ళ్లు తిరిగి ప‌డిపోయాడు. మనిషిని ఇలా కూడా చిత్ర హింస‌లు పెట్టొచ్చా అని నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు.

- Advertisement -

ఇందుకు సంబంధించిన వీడియో శ్రీముఖి సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్షం కాగా, దీనికి కాన్సెప్ట్ అండ్ డైరెక్ష‌న్ కూడా స్వీట్ ప‌ర్స‌న్ నాగ‌బాబుగారిదే అంటూ క్యాప్ష‌న్ పోస్ట్ చేసింది. కాగా, శ్రీముఖి బుల్లితెర యాంక‌ర్‌గానే కాకుంగా న‌టిగాను రాణిస్తుంది. శ్రీముఖి ఇటీవల ‘క్రేజీ అంకుల్స్’ అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీలో సింగర్ మనో, రాజా రవీంద్ర ఇతర పాత్రల్లో నటించారు. అడల్ట్ కామెడీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. అలాగే నితిన్ మ్యాస్ట్రో మూవీలో శ్రీముఖి మెరిసింది. మ్యాస్ట్రో మూవీ ఓటిటిలో విడుదలై విజయం అందుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement