Naga Babu | మెగా బ్రదర్ నాగబాబు తాజాగా తన ఫ్యామిలీ విషయాల మీద స్పందించారు. పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ జీవితం ఎలా ఉంది, నిహారిక రెండో పెళ్లి చేసుకుంటుందా అనే దానిపై తాజాగా ఆంగ్ల మీడియాతో ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు. తాను ఎప్పుడూ కూడా పిల్లలు తీసుకునే నిర్ణయాల్లో దూరను అని, పిల్లలకి ఏం చేయాలో ఏం చేయకూడదో.. తప్పేంటో, రైటేంటో వారికి తెలుసు అని నాగబాబు చెప్పుకొచ్చారు. నిహారికకి తనకొక మంచి పార్టనర్‌ను వెతకడంలో ఒక తండ్రిగా తాను విఫలమయ్యానని తెలిపారు. నిహారికది పెద్దలు కుదిర్చిన వివాహమే. పెళ్లిపై ఆమెను ఒత్తిడి చేసి ఉండాల్సింది కాదు. ఈ పెళ్లిపై ఆమెను అడగగా ఇష్టమేనని అంగీకరించింది. మేము కూడా ఆమె ఈ సంబంధం సరైనదని అనకున్నాం.
అయితే వారిద్దరికీ కొన్ని విషయాల్లో బేధాభిప్రాయాలు వచ్చాయి. విడిపోవాలని అనుకున్నారు. కలిసి ఉండమని నేను బలవంతం చేయలేదు. వాళ్లకు కలిసి ఉండలేం అనిపించింది, ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు అని నాగబాబు అన్నారు. గతంలో నిహారిక, చైతన్య విడాకులపై స్పందించిన నాగబాబు తాజాగా నిహారిక విడాకుల అంశం గురించి స్పందించారు. ఏదో ఒక రోజు నిహారిక మరో అబ్బాయిని పెళ్లి చేసుకుంటుందని.. వారి విషయాల్లో తాను ఇన్వాల్వ్ కావాలనుకోవట్లేదని నాగబాబు స్పష్టం చేశారు. పిల్లలకు నచ్చినట్లుగా వాళ్లు జీవించాలని తాను కోరుకుంటానని ఓ ఇంటర్వ్యూలో నాగబాబు వ్యాఖ్యానించారు. విడాకుల సమయంలో కొంత కాలం నిహారిక బయటకు రాలేదు. ఆ తర్వాత తేరుకొని ప్రొడక్షన్ మీద దృష్టిపెట్టింది.
గత ఏడాది ఆమె నిర్మాణంలో తెరకెక్కిన ‘కమిటీ కుర్రాళ్ళు’ మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ‘మ్యాడ్’ ఫేమ్ సంగీత్ శోభన్ హీరోగా ఆమె ఓ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక వరుణ్ తేజ్ వచ్చి లావణ్యని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్పడంతో ఆమెతో హ్యాపీగా ఉంటావా? భవిష్యత్తులో ఇబ్బందులు వస్తే ఏం చేస్తావ్ అని అడిగాను అని నాగబాబు చెప్పారు. అయితే ఆమెతో హ్యాపీగా ఉంటాను, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా చూసుకుంటాను అని చెప్పాడు. వాళ్లిద్దరూ ప్రస్తుతం హ్యాపీగా ఉన్నారు అని నాగబాబు స్పష్టం చేశారు.