మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సెప్టెంబర్10న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. అపోలో ఆసుపత్రిలో గత కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్న తేజ్ ఆరోగ్యంపై అభిమానులలో అనేక సందేహాలు నెలకొన్నాయి. ఆ మధ్య జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో తేజ్.. కోమాలో ఉన్నాడని, అందుకే ఈవెంట్‌కి నేను వచ్చానని పవన్ కళ్యాణ్ అన్నాడు.
రిపబ్లిక్ చిత్ర ప్రమోషన్లో భాగంగా మాట్లిడిన దర్శకుడు దేవ్ కట్టా.. రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హాస్పిటల్ నుంచి సాయి ధరమ్ తేజ్ చూశాడని అన్నాడు. యాక్సిడెంట్ తర్వాత ఆయనను వెళ్లి కలిసి మాట్లాడి వచ్చానని.. సాయిని కలిసిన తర్వాతే అక్టోబరు 1న సినిమా విడుదల చేస్తున్నట్లు ప్రకటించామని దేవా కట్టా తన ఇంటర్వ్యూలో చెప్పాడు. పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు కోమాలో ఉన్నాడు అని చెప్పగా, దేవ్ కట్టా మాత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ చూశాడని అంటున్నారు.
వీటిపై అభిమానులలో గందరగోళం నెలకొనగా,తాజాగా మెగా బ్రదర్ క్లారిటీ ఇచ్చారు.తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేసిన ఆయనను మెగాభిమానులు సాయితేజ్ ఆరోగ్యం గురించి తెలిపాలని కోరారు. ‘ప్రస్తుతం తేజ్ ఆరోగ్యంగానే ఉన్నాడు. అతి త్వరలోనే మళ్లీ మనముందుకు వస్తాడు. మీ ప్రార్థనలన్ని ఫలించి తేజ్ క్షేమంగా భయటపడ్డాడు’ అని నాగబాబు పేర్కొన్నారు. తేజ్ నటించిన రిపబ్లిక్ చిత్రం అక్టోబర్ 1న విడుదల కానున్న విషయం తెలిసిందే.