Naga Babu | మెగా ఫ్యామిలీ అంటే మనకు ఠక్కున గుర్తొచ్చే హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్. ఈ ఇద్దరు హీరోలు మెగా ఫ్యామిలీకి ఎంతో కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారు. అయితే వీరి తల్లి అంజనా దేవి అనారోగ్యంతో బాధపడుతున్నట్టు కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఆ మధ్య అస్వస్తతకి గురైందని వార్తలు రాగా, తాజాగా మరోసారి అంజనా దేవికి ఆరోగ్యం బాలేదని నెట్టింట ప్రచారం జరుగుతుంది. అంజనా దేవి హెల్త్ సీరియస్ అని తెలియడంతో హుటాహుటిన అమరావతి నుంచి హైదరాబాద్ సిటీకి ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రయాణం అయ్యారని వార్తలు వచ్చాయి.
మంగళవారం తెల్లవారుజామున అంజనాదేవి అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించినట్లు చెప్పుకొచ్చారు. అయితే ఈ వార్తలపై నాగబాబు ట్విట్టర్లో స్పందిస్తూ… అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది. ఈ విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతుంది. ఆమె ప్రస్తుతం బాగానే ఉన్నారు అని తెలుపుతూ అంజనాదేవి ఆరోగ్యంపై వచ్చే వార్తలకు చెక్ పెట్టారు. మరోవైపు చిరంజీవి పీఆర్ టీమ్ స్పందిస్తూ.. చిరంజీవి తల్లికి సీరియస్ అని వస్తున్న వార్తల్లో నిజం లేదు. చిరంజీవి షామీర్ పేట్ లో షూటింగ్ లో ఉన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్సనల్ వర్క్ మీద హైదరాబాద్ వస్తున్నారు. దయచేసి ఫేక్ న్యూస్ లు స్ప్రెడ్ చెయ్యవద్దు అని తెలిపారు.
అంజనా దేవికి ముగ్గురు కుమారులు కాగా, అందులో పెద్దవారు మెగాస్టార్ చిరంజీవి పెద్ద. తొలుత ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి స్వయంకృషితో స్టార్ హీరోగా ఎదిగారు. ఎటువంటి సినీ నేపథ్యం లేనప్పటికీ… తెలుగు చిత్రసీమలో అగ్ర కథానాయకుడిగా ఎదిగారు. చిరంజీవి తర్వాత నాగబాబు, పవన్ కళ్యాణ్, వాళ్ళ సంతానం సైతం సినిమాల్లోకి వచ్చి సత్తా చాటుతున్నారు. పవన్ మినహా మిగతా అందరూ కూడా హైదరాబాద్లోనే ఉన్నారు. పవన్ ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న నేపథ్యంలో ఆయన కొంత కాలంగా ఏపీలో ఉంటున్నారు. ఒకవైపు సినిమాలు చేస్తూ మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉన్నారు.