Nag Tabu | సిల్వర్ స్క్రీన్‌పై కొన్ని కాంబినేషన్లకు సూపర్ క్రేజ్ ఉంటుందని తెలిసిందే. అలాంటి హిట్ పెయిర్స్ లో ఒకటి అక్కినేని నాగార్జున-టబు. ఈ ఇద్దరు ఆన్స్క్రీన్తోపాటు ఆఫ్‌స్క్రీన్‌లోనూ హాట్ టాపిక్‌గా నిలిచేవారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సిసింద్రీ, నిన్నే పెళ్లాడతా, ఆవిడా మా ఆవిడే సినిమాలతో సూపర్ హిట్ పెయిర్‌గా నిలిచింది. ఈ ఇద్దరూ కలిసి నటించక రెండు దశాబ్ధాలకుపైనే అవుతుంది.
మళ్లీ ఎప్పుడు కనిపిస్తారో అని ఎదురుచూస్తున్న అభిమానుల కోసం అదిరిపోయే వార్త ఒకటి బయటకు వచ్చింది. ఈ ఇద్దరూ మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఇంతకీ ఏ సినిమా అనే కదా మీ డౌటు. నాగ్ 100వ సినిమాలో టబు మెరవనుందట. దీనికి సంబంధించి మేకర్స్ అధికారికంగా ప్రకటన ఏం చేయనప్పటికీ నాగ్ అభిమానులు మాత్రం నెట్టింట సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు రా కార్తీక్ (Ra Karthik) డైరెక్ట్ చేయబోతున్నాడని తెలిసిందే.
ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే మొదలైంది.తాజా టాక్ ప్రకారం ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండనుండగా.. వీరిలో వన్ ఆఫ్ కీ రోల్లో టబు కనిపించబోతున్నట్టు సమాచారం. టబు ప్రస్తుతం తెలుగులో పూరీ జగన్నాథ్-విజయ్ సేతుపతి సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ఒకవేళ నాగ్ సినిమాలో ఫైనల్ అయితే టబు ఈ సీజన్లో పనిచేస్తున్న రెండో సినిమా కానుంది. టబు ఎంట్రీ నాగ్ మైల్ స్టోన్ ప్రాజెక్ట్‌కు చాలా కలిసొస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ మూవీని నాగార్జున 2026 మే నెలలో సమ్మర్ కానుకగా అభిమానుల ముందుకు తీసుకురావాలని ఫిక్స్ అయినట్టు సమాచారం. కూలీలో తొలిసారి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన నాగార్జున మరి రా కార్తీక్‌తో ఎలాంటి కథ చేయబోతున్నాడన్నది అందరిలో ఉత్కంఠ నెలకొంది.