మంగళవారం 26 జనవరి 2021
Cinema - Nov 08, 2020 , 07:36:19

మోనాల్‌- అఖిల్ మ‌ధ్య గ్యాప్..క‌లిపే ప్ర‌య‌త్నం చేసిన నాగ్

మోనాల్‌- అఖిల్ మ‌ధ్య గ్యాప్..క‌లిపే ప్ర‌య‌త్నం చేసిన నాగ్

బిగ్ బాస్ సీజ‌న్ 4 డే 1 నుండి చాలా క్లోజ్ గా ఉంటూ వ‌స్తున్న అఖిల్, మోనాల్ గ‌త కొద్ది రోజులుగా దూరంగా ఉంటున్నారు. సోహైల్ విష‌యంలో వ‌చ్చిన మ‌న‌స్ప‌ర్థ‌ల వ‌ల‌న‌నే అఖిల్ ఆమెను దూరం పెట్టాడ‌ని, మోనాల్‌ని నామినేట్ చేయ‌డానికి కార‌ణం కూడా అదేన‌ని అంద‌రు భావించారు. దీనిపై నాగ్ క్లారిటీ తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేశారు. మోన‌ల్‌తో మాట్లాడిన నాగ్... ఏమైంది ఈ మ‌ధ్య ఒంటరిగా ఉన్న‌ట్టు ఫీల‌వుతున్నావ్, బిహేవియర్ కూడా మారిపోయింది అని అడిగాడు నాగ్. దీంతో కాస్త ఎమోష‌న‌ల్ అయిన మోనాల్ విష‌యాన్ని చెప్పుకొచ్చింది.

నాకు ఎగ్ అంటే అస్స‌లు ప‌డ‌దు. అయిన‌ప్ప‌టికీ నాపైన అఖిల్ ఎగ్ కొట్టాడు. నేను ఇది అస్స‌లు ఊహించ‌లేదు. న‌న్ను నామినేట్ చేయ‌డానికి అత‌ని ద‌గ్గ‌ర త‌గ్గ రీజ‌న్ లేదు. అఖిల్‌ని నా ఫ్యామిలీ అనుకున్నా. అత‌నితో మాట్లాడే ప్ర‌య‌త్నం చేసా. అయిన‌ప్ప‌టికీ స‌డెన్‌గా క‌ట్ చేశాడు. ఎందుకో రీజ‌న్ మాత్రం చెప్ప‌లేదు అని మోనాల్ బాధ‌ప‌డుతూ చెప్పింది. అయితే ఈ విష‌యంపై అఖిల్‌తో కూడా క్లారిటీ తీసుకునే ప్ర‌య‌త్నం చేశారు నాగ్.

అఖిల్ మాట్లాడుతూ.. ఇన్ని రోజుల‌లో త‌న‌ని నేనెప్పుడూ నామినేట్ చేయ‌లేదు.ఇప్పుడు గేమ్ ట‌ఫ్‌గా మారుతూ వ‌స్తుంది. నేను స‌పోర్ట్ చేయ‌డం వ‌ల‌న మోనాల్ గేమ్ స్ట్రాంగ్‌గా ఆడ‌లేక‌పోతుంది. ఈ సారి నామినేట్ చేయ‌డం వ‌ల‌న చాలా క‌సిగా ఆడింది. మోనాల్ స్ట్రాంగ్ కావాల‌నే ఉద్ధేశంతో నేను నామినేట్ చేసాన‌ని అఖిల్ అన‌డంతో ఇది నాకు వాలిడ్ పాయింట్‌లానే ఉంద‌ని నాగ్ అన్నాడు . అనంత‌రం మోనాల్‌, అఖిల్‌కు నాగ్ సూటి ప్ర‌శ్న‌లు వేశారు. అఖిల్‌ని.. నీకు మోనాల్ ఫ్రెండేనా?  లేదంటే అంత‌క‌న్నా ఎక్కువ‌నా? అని ప్ర‌శ్నించాడు. దీనికి అఖిల్ ఫ్రెండ్ మాత్ర‌మే అని అన్నాడు.

మోనాల్‌ని ఇదే విష‌యం అడ‌గ‌గా, తాను ఫ్రెండ్ అని చెప్పింది.  అయితే ఈవారంలోనే అభిప్రాయం మారిందా? అని నాగార్జున అడగడంతో... నాకు తెలియదు సార్ అని చెప్పింది మోనాల్.


logo