ధనుష్ దేవర పొలి, భానుచందర్, శ్వేత, సత్యప్రియ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘నడికట్టు’. ఎస్.వి.దిలీప్‌కుమార్ దర్శకుడు. సహస్ర క్రియేషన్స్ పతాకంపై మంచూరి సోమశేఖర్ రావు నిర్మిస్తున్నారు. ఇటీవలే చిత్ర ట్రైలర్‌ను నటుడు రాజారవీంద్ర విడుదల చేశారు. తమ సంస్థకిది తొలి చిత్రమని, వినూత్న కథాంశంతో రూపొందించామని నిర్మాత పేర్కొన్నారు.
మనసుకు హత్తుకునే ప్రేమకథ ఇదని, కొత్తవాళ్లతో పాటు సీనియర్ నటీనటులు ఈ సినిమాలో భాగమయ్యారని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.వెంకటేష్, దర్శకత్వం: ఎస్.వి.దిలీప్ కుమార్.